ENGLISH | TELUGU  

కూటమి వైపే టాలీవుడ్.. ఫలితాల రోజు చెమటలు పట్టడం ఖాయమా!

on May 10, 2024

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చింది. ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో కూటమికే మెజారిటీ సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. ఈ దెబ్బకి ఏపీలో సంచలన ఫలితాలు రావడం ఖాయమనే అంచనాలున్నాయి.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి హీరోల సపోర్ట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమాగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. కూటమి తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీకి కంచుకోటగా పేరున్న రాయలసీమలో.. బాలయ్యకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగా ఉంది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి మెగా హీరోలు.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు. అలాగే చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కి, కూటమికి మద్దతు తెలుపుతూ ప్రత్యేక వీడియోలు విడుదల చేశారు. రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించాడు. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా తమ మద్దతుని తెలిపింది. పవన్ కే తమ ఫుల్ సపోర్ట్ అని.. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ప్రకటించారు. అలాగే, బీజేపీ అభ్యర్థుల తరపున దగ్గుబాటి వెంకటేష్, రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ప్రచారం నిర్వహించారు. 

నందమూరి, మెగా, అల్లు, దగ్గుబాటి, రెబెల్ స్టార్ వంటి బడా ఫ్యామిలీలతో పాటు.. కూటమికి సపోర్ట్ చేస్తున్న సినీ ప్రముఖుల లిస్టు ఇంకా భారీగానే ఉంది. హీరోలు నాని, తేజ సజ్జ, నిఖిల్, నారా రోహిత్, రాజ్ తరుణ్.. సీనియర్ నటులు నరేష్, సురేష్.. కమెడియన్స్ సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీ, రఘు.. జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, కిరాక్ ఆర్పీ.. ఇలా ఎందరో కూటమికి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ఇంకా ఎందరో నటీనటులు, దర్శకనిర్మాతలు తామంతా కూటమి వైపే అని స్పష్టం చేశారు. టికెట్ ధరలతో పాటు పలు కారణాల వల్ల.. అధికార పార్టీపై సినీ పరిశ్రమ నుంచి ఈ స్థాయి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది.

ఇప్పటికే సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు టాలీవుడ్ కి చెందిన పలు బడా ఫ్యామిలీలతో పాటు.. మెజారిటీ సినీ పరిశ్రమ అంతా కూటమి వైపే ఉంది. బడా స్టార్ ఫ్యామిలీల అభిమానులు, సినీ ప్రియుల ఓట్లు తోడై.. ఏపీలో కూటమి అంచనాలకు మించిన ఫలితాలతో సంచలనం సృష్టించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.