Home

»

Latest News

80s రెట్రో అవతార్: ఏ హీరో లుక్ అదిరిపోయింది.?

Sep 10, 2026 2:31PM

ప్రస్తుతం 80s ట్రెండ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. AIను ఉపయోగించి 1980s రెట్రో లుక్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో ఫోటోలను జనరేట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇప్పటి స్టార్స్ ఫోటోలను కూడా 80s రెట్రో లుక్ లోకి మార్చి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక AI వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శివ సినిమాలోని 'బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది' పాటను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తూ.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవేరుకోండ హీరోలను 80s రెట్రో లుక్ లో చూపిస్తూ డిజైన్ చేసిన వీడియో అదిరిపోయింది. పాతకాలపు నోస్టాల్జియాను, నేటి మోడర్న్ స్టార్ల ఇమేజ్‌ను మిక్స్ చేసి క్రియేట్ చేసిన ఈ కాన్సెప్ట్ వీడియో అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇస్తోంది. ఫ్యాన్స్ ఈ వీడియో చూసి ఫిదా అవుతున్నారు.

 

 

 

[80s Look Trend, Pawan Kalyan, Mahesh Babu, Prabhas, Jr NTR, Ram Charan, Allu Arjun, Nani, Vijay Deverakonda, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com