
-సెట్స్ పై వెంకీ గౌడ, త్రివిక్రమ్ మూవీ
-అభిమానుల్లో భారీ అంచనాలు
-థమన్ చేయకపోవడంపై పలు అనుమానాలు
-వివరణ ఇచ్చిన థమన్
కొన్నిరోజులుగా మూవీ లవర్స్ ఎక్కడ కలిసినా ఒకటే మాట. ఏమోయ్ ఇది నిజమేనా! వెంకీ గౌడ, త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)ఆదర్శ కుటుంబం House No 47 కి థమన్ పని చెయ్యడం లేదంటగా, అసలు ఆ ఇద్దరు ఏమనుకుంటున్నారు. ఆ కాంబో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి అల వైకుంఠపురం, గుంటూరు కారంతో మంచి బీట్ తో కూడిన సాంగ్స్ వస్తున్నాయి కదా వాళ్ళు ఇలా చేయడం అసలేం బాగోలేదు. కొంపతీసి ఆ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా యేటి! ఒక వేళ ఉంటే మనం మాట్లాడదాం అని మాట్లాడుకుంటున్నారు. మరి హిట్ కాంబోలో వచ్చే మ్యూజిక్ కి ఉన్న శక్తీ అలాంటిది. అందుకే ఎన్నో కాంబినేషన్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలతో వీనుల వీందైన సంగీతాన్ని అందిస్తూ వస్తున్నాయి. వాళ్ళందరి కోసం త్రివిక్రమ్ తో ఎందుకు ట్రావెల్ చేయడంలేదో థమన్ నే వెల్లడి చేసాడు. ఆ మాటలు ఒకసారి చూద్దాం.
రీసెంట్ గా థమన్(Thaman)సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు త్రివిక్రమ్ సార్, నా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. వెంకటేష్ సర్ ప్రాజెక్ట్ కోసం ఒక కొత్త టీంతో ప్రయాణించాలని ఆశించారు. ఈ విషయంలో ఇద్దరం పరస్పరం చర్చించుకున్న తర్వాతే మార్పు నిర్ణయానికి వచ్చాం. ఒకే రకమైన కాంబినేషన్ కాకుండా ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇవ్వడం కూడా మార్పుకి కారణమని థమన్ చెప్పుకొచ్చాడు. దీంతో థమన్, త్రివిక్రమ్ మధ్య గ్యాప్ వచ్చిందనే న్యూస్ లో నిజం చప్పబడిపోయింది. ఆదర్శ కుటుంబంకి 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.
Also read: Peddi: పెద్దితో మృణాల్ ఠాకూర్!.. జాన్వీకపూర్ పరిస్థితి మీకేమైనా తెలుసా
థమన్ రీసెంట్ గా బ్యాక్ గ్రౌండ్ సమకూర్చిన పవర్ స్టార్ పవన్ వన్ మాన్ షో 'ఉస్తాద్ భగత్ సింగ్'(UStaad Bhagat Singh)థియేటర్స్ లో రన్ అవుతున్న విషయం తెలిసిందే. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా థమన్ చేతిలో ఉన్నాయి. ఈ వివరాలపై త్వరలోనే మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.






