Home

»

Latest News

Thadayam Web Series Review: తడయం వెబ్ సిరీస్ రివ్యూ

Mar 21, 2026

 

నటీనటులు: సముద్రఖని, శివదా, రాజ్ తిరందాస్, సుందర్ పాండియన్, మున్నార్ రమేశ్ తదితరులు
ఎడిటింగ్: దినేశ్ కుమార్
మ్యూజిక్:  విబిన్ భాస్కర్
సినిమాటోగ్రఫీ: కేకే
నిర్మాతలు: అజయ్ కృష్ణ
రచన, దర్శకత్వం: నవీన్ కుమార్ పళనివేల్
ఓటీటీ : జీ 5

ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లపై ఎప్పుడూ ఆసక్తే ఉంటుంది. ఆ క్యూరియాసిటీని మరింత పెంచుతూ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ 5' లో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ సిరీస్ 'తడయం'. సముద్రఖని, శివదా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథేంటో ఓ సారి చూసేద్దాం.

కథ:

ఆంధ్ర - తమిళనాడు సరిహద్దులోని ఒక గ్రామం అది. అక్కడ పోలీస్ స్టేషన్ లో అధియమాన్ (సముద్రఖని) ఎస్.ఐ.గా పనిచేస్తుంటాడు . 20 ఏళ్లలో అతనికి ఎప్పుడూ ఎలాంటి ప్రమోషన్స్ రావు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా, తనకేమీ పట్టనట్టుగా అతను వ్యవహరిస్తుంటాడు. ఎప్పుడు చూసిన అతను 'టీ' కొట్లోనే కూర్చుని ఉంటాడనే ఒక విమర్శ ఉంటుంది. త్వరలో అతను వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉంటాడు. ఆ సమయంలోనే అతని పైఅధికారిగా కొత్తగా డ్యూటీలో చేరుతుంది లక్ష్మీ (శివదా). అధియమాన్ ధోరణి శివదాకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హత్య కేసుల విషయంలో కూడా అతను కూల్ గా వ్యవహరించడంపై మండిపడుతుంది. అయితే అధియమాన్ చాలా తెలివైనవాడని , అతను ఏ విషయానికీ పెద్దగా చెలించకపోవడానికి కారణం ఉందని ఓ పోలీస్ ద్వారా లక్ష్మీ తెలుసుకుంటుంది. అదే సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. కొత్తగా డ్యూటీలోకి చేరిన లక్ష్మీ ఈ మిస్టరీని ఛేదించాలని అధియమాన్ ను తన టీమ్ లోకి తీసుకుంటుంది. వరుసగా జరుగుతున్న హత్యలపై అతని అభిప్రాయం అడుగుతుంది. అప్పుడు అధియమాన్ ఏం చెప్తాడు? హంతకులు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారనేది మిగతా కథ.


విశ్లేషణ:

తడయం అంటే క్లూ.. అంటే ఒక్కో క్రైమ్ కి ఒక్కో క్లూ ఉంటుంది. దానిని పోలీసులు కనిపెట్టారా లేదా అని ఈ సిరీస్ లో ఉంటుంది.   ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్ లు ఉన్నాయి. ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ పద్దెనిమిది నుండి ఒరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది. ఆరు ఎపిసోడ్ లు కలిపి మొత్తంగా  నిడివి  రెండు గంటల ఏడు నిమిషాలు. ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్.  ఎక్కడా కమర్షియల్ హంగులకి వెళ్ళకుండా కథని వాస్తవికతకు దగ్గరగా చూపించారు.

సిరీస్ లో అక్కడక్కడా కొంత రక్తపాతం సీన్లు ఉంటాయి‌. అయితే ఆ రక్తపాతం సీన్లు క్రైమ్ ఎలా జరిగిందనే పాయింట్ ని వివరిస్తూ తీసారు కాబట్టి అది ఒకే అనిపిస్తే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. తక్కువ అంచనాలతో ఈ సిరీస్ ని చూస్తే మంచి క్రైమ్ థ్రిల్లర్ ని చూసిన ఫీలింగ్ వస్తుంది.

సిరీస్ ని కాస్త స్లోగా మొదలు పెట్టిన దర్శకుడు.. ప్రతీ ఎపిసోడ్ కి ఒక్కో క్లూని చూపిస్తూ నెక్స్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందోననే క్యూరియాసిటీని రేకెత్తించాడు. అయితే కేస్ ఇన్వెస్టిగేషన్ ని ఇంకాస్త ఎంగేజింగ్ గా గ్రిప్పింగ్ గా తీస్తే బాగుండేది. ముఖ్యంగా నేరస్తుడు ఎవడో తెలిసాక కూడా సీన్లు రిపీటెడ్ గా వస్తుంటాయి‌. వాటిని తగ్గించి , విలన్ తో హీరో డైలాగ్స్ ఇంకాస్త ఆడ్ చేస్తే ఇది బెస్ట్ థ్రిల్లర్ గా నిలిచిపోయేది. అయితే కథా వస్తువు బాగుంది. ఫ్రెష్ ఫీల్ ని తెప్పించేలా కథని మలిచారు దర్శకుడు. కేకే సినిమాటోగ్రఫీ, విబిన్ భాస్కర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ థ్రిల్లర్ కు మరింత బలాన్ని చేకూర్చాయి. అసభ్య పదజాలం వాడలేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ సీన్లు లేవు. మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిడివి కూడా తక్కువే కాబట్టి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూసేయొచ్చు.

నటీనటుల పనితీరు:

సముద్రఖని నటన మరోసారి ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. కళ్ళతోనే భావాలు పలికించడం ఆయన ప్రత్యేకత. ఇక శివద సపోర్టింగ్ క్యారెక్టర్ కాకుండా ఇన్వెస్టిగేషన్ లో కీలకపాత్ర పోషించారు. మిగతా వారు తమ పాత్రలకి న్యాయం చేశారు.

ఫైనల్ గా : మస్ట్ వాచెబుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

రేటింగ్: 2.75 / 5


✍️. దాసరి మల్లేశ్

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com