TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

‘మిషన్‌ కుట్టేటి సుందరి..’ సాంగ్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌!

Mar 8, 2025 2:25PM

మాస్‌ బంక్‌ మూవీస్‌ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్‌ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్‌ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా  నిర్మిస్తున్న హర్రర్‌ బేస్డ్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ ‘లోపలికి రా చెప్తా’.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. 

రీసెంట్‌గా ‘లోపలికి రా చెప్తా’ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన ‘మిషన్‌ కుట్టేటి సుందరి..’ సాంగ్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాటకు అలరాజు రాసిన లిరిక్స్‌, డేవ్‌ జాండ్‌ కంపోజ్‌ చేసిన బ్యూటిఫుల్‌ ట్యూన్‌, వెంకట రాజేంద్ర పాడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట సక్సెస్‌ నేపథ్యంలో మూవీ టీమ్‌ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అన్నివర్గాల ఆడియెన్స్‌కు నచ్చేలా తమ ‘లోపలికి రా చెప్తా’ సినిమా ఉంటుందని, త్వరలో మంచి డేట్‌ చూసి గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్‌, అజయ్‌ కార్తీక్‌, ప్రవీణ్‌ కటారి, రమేష్‌ కైగూరి, వాణి ఐడా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డేవ్‌ జాండ్‌, సినిమాటోగ్రఫీ: రేవంత్‌ లేవాక, అరవింద్‌ గణేశ్‌, ఎడిటింగ్‌: వంశీ, నిర్మాతలు: లక్ష్మీగణేష్‌ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్ర.

google-ad-img