స్వాతి కథ కొత్తది కాదంట...!
on Feb 21, 2014
నవదీప్, స్వాతి కలిసి నటించిన "బంగారు కోడిపెట్ట" చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా స్వాతి మీడియాతో మాట్లాడుతూ... "అచ్చమైన తెలుగు కథ ఈ సినిమా. సంక్రాంతి నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నా పాత్ర భానుమతి పినిశెట్టి. ఎనిమిదో తరగతి ఫెయిల్ అయిన ఆ అమ్మాయి ఎలాగోలా ఇంగ్లిష్ నేర్చుకొని ఓ షాపింగ్ మాల్ లో ఉద్యోగం చేస్తుంటుంది. ఎప్పటికైనా కష్టాల నుంచి గట్టెక్కి ఇల్లు, కారు కొనుక్కోవాలనేది ఆమె కల. దానికోసం ఆమె ఏం చేసింది అనేదే ఈ కథ. ఇది కొత్త కథ ఏం కాదు. కానీ ఆ కథను చెప్పే విధానంలో కొత్తదనం కనిపిస్తుంటుంది. తప్పకుండా అందరినీ మెప్పించే ఓ మంచి చిత్రమవుతుంది" అని అన్నారు.