నాని కళ్యాణం వివరాలు
on Feb 21, 2014

నాని, వాణీకపూర్ జంటగా నటించిన తెలుగు, తమిళ చిత్రం "ఆహా కళ్యాణం" చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో విజయం సాధించిన "బ్యాండ్ బాజా బారత్" సినిమాకు రీమేక్. సినిమా కథలో పెద్దగా మార్పులేమీ లేకపోయినా కూడా సినిమా మొత్తం కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. నాని, వాణీల జంట చూడటానికి బాగుంది. కానీ కథలో కాస్త తెలుగు సినిమా అని అనిపించేలా మార్పులు చేస్తే బాగుండేది. ఎందుకంటే సినిమాలో చాలా చోట్ల తమిళ వాసన తగిలింది. "నో వన్ డాన్సింగ్.." అనే సాంగ్ లో ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. నిజానికి ఈ సినిమా కంటే హిందీ ఒరిజినల్ బాగుందనే చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో మరికొద్ది గంటల్లో తెలియనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



