Home

»

Latest News

ఇరుముడి నటికి బెదిరింపులు.. రోడ్డుపై కనిపిస్తే కొడతాం 

Aug 27, 2026 4:07PM

 

సినిమాకి సంబంధించి  హీరో క్యారక్టర్ ని ప్రేక్షకులు ఎంతలా ప్రేమిస్తారో, నెగిటివ్ రోల్ లో చేసిన వారిని అంతే ఇదిగా ద్వేషిస్తారు.  కానీ ఆ ద్వేషం స్థాయి హద్దులు కూడా దాటుతుంది. దీంతో ఆ క్యారక్టర్ చేసిన వారికి బెదిరింపులు వస్తుంటాయి. అంతలా నెగిటివ్ క్యారక్టర్ లో లీనమయ్యి నటిస్తారు. అలా లీనమయ్యి నటించిన నటి స్వాసిక విజయ్.

ఇరుముడిలో ధనలక్ష్మి అనే టీచర్ గా కీలకమైన రోల్ లో కనిపించింది. ఆ  రోల్ లో ఆమె నటన ఏ స్థాయిలో ఉందంటే, థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఆమె రోల్ పై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వాసిక విజయ్ మాట్లాడుతు 'సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో తనకు వస్తున్న మెసేజ్‌లు చూసి ఆశ్చర్యపోయానని, నువ్వు సినిమాలో చాలా చెడ్డ పాత్ర చేశావు.. నిన్ను బయట చూస్తే కొట్టాలనిపిస్తోంది" అంటూ నెటిజన్లు మెసేజ్‌లు పెడుతున్నారని, నెగిటివ్ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఒక నటిగా ఇవే తనకు లభించిన అతిపెద్ద ప్రశంసలు. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు స్వయంగా నాకే నా క్యారక్టర్ పై కోపం వచ్చింది. సమాజంలో ధనలక్ష్మి అనేది చాలా పవిత్రమైన, మధురమైన పేరు. కానీ  సినిమాలో మాత్రం ఒక చెడ్డ మనస్తత్వం ఉన్న మహిళగా  డిజైన్ చేశారు  సమాజంలో ఉండే కొందరు చెడ్డ టీచర్ల వైఖరిని ప్రతిబింబించేలా దర్శకుడు శివ నిర్వాణ మలిచారని చెప్పుకొచ్చింది. స్వాసిక విజయ్ మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన నటి.


Also Read: ప్రముఖ సింగర్ దారుణహత్య

Swasika Vijay, Irumudi, Tollywood, eluguCinema,TeluguNews,TeluguCinemaNews, TeluguOneDotCom

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com