
ఇటీవల మూవీ ప్రమోషన్స్ లో కొందరు దర్శకులు, నటీనటులు ఇస్తున్న స్టేట్మెంట్స్ వైరల్ అవుతున్నాయి. మా సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా, నడిరోడ్డు మీద షర్ట్ విప్పి నిల్చుంటా అంటూ ఇలా ఎన్నో ఛాలెంజ్ లు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో ఒక హీరోయిన్ కూడా చేరిపోయింది.
గ్లింప్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన 'సహా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన చిత్రంపై ఉన్న నమ్మకంతో ఆమె విసిరిన సవాల్ ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. "నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరూ ఎంత మంచి సినిమా తీశారురా వీళ్లు అని కచ్చితంగా అనుకుంటారు. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అసలు ఎవ్వరూ డిజప్పాయింట్ అవ్వరు. ఒకవేళ ఎవరైనా డిజప్పాయింట్ అయితే అమీర్‌పేట్ సెంటర్‌లో నిలబడి గుండు గీయించుకుంటా." అన్నారు.
ఈ ఈవెంట్ లో 'సహా' మూవీ హీరో శివకుమార్ సైతం ఇలాంటి కామెంట్స్ చేయడం విశేషం. "సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతున్న మా సినిమా చూసే ప్రేక్షకులకు నా రిక్వెస్ట్. మీరు అంచనాలు ఏ స్థాయిలో అయినా పెట్టుకొని రండి. ఆ అంచనాలకు ఒక్క శాతం తగ్గినా.. నాకు ఫోన్ చేసి బూతులు తిట్టండి." అంటూ తన ఫోన్ నెంబర్ ఇచ్చారు.
మరి 'సహా' మూవీపై హీరోహీరోయిన్లు పెట్టుకున్న ఈ అపారమైన నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి.
[Swetha Lakshman, Bold Challenge, Sahaa Life of Sanju, Sahaa Movie]






