Home

»

Latest News

నన్ను చంపుతారా ప్లీజ్ 

May 04, 2026

 

సోషల్ మీడియాకి దొరికిన అరుదైన అందగత్తెల్లో సుప్రిత గురించి ప్రత్యేకంగా  చెప్పుకోవాల్సిన పని లేదు. పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ని సంపాదించుకున్న సుప్రీత సెల్యులాయిడ్ పై కూడా తన సత్తా చాటింది. పెద్ద హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతున్న సుప్రీత ఓల్డ్  వీడియో ఒకటి దారి తప్పి వచ్చిందో లేక నన్ను మర్చిపోవద్దు మీకు చాలా ఉపయోగపడతానని చెప్పడానికి వచ్చిందో కానీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఏముందో చూద్దాం.

సదరు వీడియోలో సుప్రీత  తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ  కొంతకాలం క్రితం బాగా బరువు పెరిగాను. దీంతో  సోషల్ మీడియాలో నాపై వచ్చిన కామెంట్స్  చూసి మానసికంగా చాలా బాధపడ్డాను. ఆ ఒత్తిడిలోనే తినే అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. రోజుకి 12 నుంచి 15 గంటల పాటు ఏమీ తినకుండా ఉండి, ఒక్క పూట మాత్రమే తినే దాన్ని. ఆ సమయంలో  బిర్యానీ వంటి హెవీ ఫుడ్ తీసుకోవడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. 

also read:  విజయ్ ముఖ్యమంత్రి కావడానికి మన ముగ్గురు హీరోలే కారణమా! 


దీంతో పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. ఆ విధంగా హాస్పిటల్ లో 15 రోజుల పాటు చాలా కష్టాలు అనుభవించాను. నీళ్లు తాగినా వాంతులు అయ్యేవి. దీంతో రోజుకి 15 సార్లు వాంతులు అవ్వడంతో పాటు 20 రోజుల పాటు అన్నం తినలేకపోయాను. ఒక దశలో  బతకనేమో అనిపించింది.  ఆ నరకాన్ని భరించలేక ఏదైనా మందు ఇచ్చి చంపేస్తే బాగుంటుందని అనిపించిందని చెప్పుకొచ్చింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com