విజయ్, త్రిష 'మట్ట' సాంగ్ వైరల్.. అధికార పీఠం ఎక్కే వేళ పెరిగిన హంగామా!తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి' విజయ్ మరియు 'చెన్నై అందం' త్రిషల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, వీరి మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాలోని 'మట్ట' సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. విజయ్ రాజకీయ ప్రవేశం చేయడం, ఎన్నికల్లో పాల్గొనడం అందరికి తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాల్లో విజయ్ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అధికార పీఠం ఎక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ పాట తమిళనాడును ఊపేస్తోంది.
ఈ పాటలోని వీరిద్దరి డ్యాన్స్ మూమెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ వీడియో క్లిప్స్‌ను షేర్ చేస్తూ 'హిట్ జోడీ ఈజ్ బ్యాక్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం రెండు సంవత్సరాల్లో రాజకీయంగా తనదైన ముద్ర వేసిన విజయ్‌కి ఎంత ఫాలోయింగ్ ఉందో ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాజకీయ దిగ్గజాలను సైతం మట్టి కరిపించి సింహాసనాన్ని అధిరోహించేందుకు విజయ్ సిద్ధమయ్యారు. దీంతో తమిళనాడులో ఉన్న విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా విజయ్ ప్రభంజనమే కనిపిస్తోంది.





