రౌడీ స్టార్ చిత్రంలో అక్కినేని కాంపౌండ్ హీరో!
on Feb 5, 2023
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే చిత్రం చేస్తున్నారు. కానీ సమంత అనారోగ్యం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. మార్చి మొదటి వారంలో షూటింగ్ మరలా ప్రారంభించాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు సమంత నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. అయితే తాజాగా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటానని సమంత సోషల్ మీడియా వేదికగా హామీ ఇచ్చింది. అయితే ఎప్పటి నుంచి ఈ చిత్రంలో నటిస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు శివ నిర్వాణ మెగా కాంపౌండ్ హీరోతో ముందుకు వెళ్ళనున్నారని సమాచారం. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్న నూరి తో కలిసి పాన్ ఇండియా రేంజిలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇది ఒక పవర్ ఫుల్ యాక్షన్ సబ్జెక్ట్. మొదటిసారిగా ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాతను పోషిస్తున్నారు. ఇప్పటివరకు రౌడీ స్టార్ లోని రొమాంటిక్ యాంగిల్ మాత్రమే ప్రేక్షకులకు పరిచయం. తాజా చిత్రంతో ఆయన తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించనున్నారు.
ఇక గౌతమ్ చిత్రం కోసం విజయ్ పూర్తిగా తన లుక్కుని మార్చుకోబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తనను తాను కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రాజెక్టు కావడంతో బాగా కష్టపడుతున్నారు. ఈ చిత్రాన్ని వాస్తవానికి రామ్ చరణ్ చేయాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆయన నో చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అక్కినేని కాంపౌండ్ హీరో అయిన సుమంత్ ని దర్శకుడు గౌతమ్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గౌతమ్ ని దర్శకునిగా పరిచయం చేసింది.. ఆయనకు దర్శకునిగా అవకాశం ఇచ్చింది సుమంతే కావడం విశేషం. మళ్ళీ రావాతో సుమంత్ గౌతమ్ తిన్ననూరిని దర్శకునిగా పరిచయం చేశారు. అలాగే సుమంత్ కి ఆ మూవీ చాలాకాలం తర్వాత హిట్టును తెచ్చి పెట్టింది. ఈ సీనియర్ హీరో ఇప్పుడు ఇతర హీరోల సినిమాలలో కూడా కీలక పాత్రలు చేయడానికి రెడీ అంటున్నారు. సీతారామం సినిమాలో హీరో హీరోయిన్ల తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించారు. ఇక గౌతమ్ -విజయ్ మూవీ లో కూడా ఆయన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
