డిస్ట్రిబ్యూటర్ గా చక్రం తిప్పుతున్న దిల్ రాజు!
on Feb 5, 2023
గత ఏడాది నిర్మాతగా దిల్ రాజుకు పెద్దగా కలిసి రాలేదు. ఆయన తీసిన 'థాంక్యూ' చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇక సంక్రాంతికి 'వారసుడు'తో వస్తే ఈ చిత్రం కేవలం అసలు మాత్రమే వసూలు చేసింది. ఓ మోస్తరు కలెక్షన్లతో జస్ట్ ఓకే అనిపించింది. లాభాలను మాత్రం అందించలేకపోయింది. కానీ గత ఏడాది ఆయన డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం పలు హిట్ చిత్రాలను అందుకున్నారు. ఇక ఈ ఏడాది ఆయన పలు చిత్రాల హక్కులను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్- త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 28 చిత్రం హక్కులను సొంతం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. దసరా చిత్రాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఇక నాగచైతన్య హీరోగా వెంకట ప్రభు డైరెక్షన్లో రూపొందుతున్న కస్టడీ చిత్రాన్ని కూడా ఈయనే పంపిణీ చేస్తున్నారు. ఈ సినిమా నైజాం రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన నైజాం థియేట్రికల్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇలా పంపిణీదారునిగా దిల్ రాజు హవా ఇప్పటికీ తగ్గకుండా రోజు రోజుకు పెరుగుతోందని చెప్పవచ్చు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
