
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి చర్చ జరగడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా యాంకర్ రష్మి గౌతమ్‌తో ఆయన కెమిస్ట్రీకి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. అయితే సుధీర్, రష్మి ఇద్దరూ తమ మధ్య ఉన్నది స్నేహమేనని గతంలో పలుమార్లు స్పష్టం చేశారు.
ఇక ఇప్పుడు సుధీర్‌కు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ఆయనకు 2014లోనే పెళ్లి అయిపోయిందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
వైరల్ అవుతున్న ఫోటోల్లో సుధీర్‌తో పాటు జబర్దస్త్‌కు చెందిన కొందరు ఆర్టిస్టులు కూడా కనిపిస్తున్నారు. దీంతో ఆయనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని, ఇన్నేళ్లుగా ఆ విషయాన్ని బయటపెట్టలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ఫోటోల వెనుక ఉన్న అసలు విషయం వేరే ఉందనే ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వైరల్ అవుతున్న ఫోటోలు సుడిగాలి సుధీర్‌కు 2014లో జరిగిన ఎంగేజ్మెంట్కు సంబంధించినవిగా చెబుతున్నారు. ఆ సమయంలో జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పాత పోస్ట్ ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఆ ఫోటోల్లో సుధీర్ పెళ్లి దుస్తుల్లో, మెడలో పూలదండతో కనిపించడంతో చాలామంది ఆయనకు పెళ్లి అయిపోయిందని భావిస్తున్నారు.
అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని, సుధీర్‌కు ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ పెళ్లి వరకు వెళ్లకుండానే ఆ సంబంధం ముగిసిందని అంటున్నారు. అయితే దీనిపై సుధీర్ నుంచి ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు.
మొత్తానికి పదేళ్ల నాటి ఫోటోలు ఇప్పుడు వైరల్ కావడంతో సుడిగాలి సుధీర్ పెళ్లి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: 'రణబాలి'ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా.?
[Sudigali Sudheer Marriage, Sudigali Sudheer Engagement, Sudigali Sudheer Viral Photos, Sudigali Sudheer, Sudheer Rashmi, Jabardasth Rakesh, Telugu Film News]




