
అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కింగ్ 100’. ఆయన కెరీర్లో 100వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తారా? అనే ప్రశ్నకు నాగార్జున ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి ‘కింగ్ 100’ను తెలుగు సినిమాగానే చూస్తున్నామని, ఇతర భాషల్లో విడుదల చేయాలా వద్దా అనేది సినిమా పూర్తయ్యాకే నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రీసెంట్ గా ‘ఇట్లు అర్జున’ ఈవెంట్కు హాజరైన నాగార్జునను మీడియా ఇదే విషయం అడిగింది. దానికి స్పందించిన ఆయన.. సినిమా మొదలుపెట్టినప్పుడే పాన్ ఇండియా అని ఆలోచించడం వల్ల అనవసరమైన గందరగోళం మొదలవుతుందని అభిప్రాయపడ్డారు.
పాన్ ఇండియా సినిమా అనగానే ఏ భాషకు చెందిన నటులను తీసుకోవాలి? డైలాగులు అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చేలా ఎలా రాయాలి? మన సంస్కృతి, సంప్రదాయాలు ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు నచ్చుతాయా? అనే లెక్కలు మొదలవుతాయని నాగార్జున వివరించారు. ఈ క్రమంలో కథలోని సహజత్వాన్ని పక్కనపెట్టే పరిస్థితి రాకూడదన్నది ఆయన అభిప్రాయం.
‘తెలుగు సినిమాని తెలుగు సినిమా లాగే తీయాలి.. ఆ తర్వాతే మిగతావన్నీ’ అన్న నాగార్జున మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముందుగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మంచి సినిమా తీయాలని, అది పూర్తయ్యాక ఇతర భాషల్లో విడుదల చేసే విషయాన్ని పరిశీలించాలన్నది ఆయన ఆలోచన.
నాగార్జునకు తెలుగు ప్రేక్షకులతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది తెలుగు ప్రేక్షకులేనని ఆయన గతంలోనూ స్పష్టం చేశారు. అందుకే ఇతర మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని మొదటి నుంచే కథను మార్చుకోవడం కంటే, మన ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇక ‘కింగ్ 100’ విషయానికి వస్తే.. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జునతో పాటు టబు, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: సుడిగాలి సుధీర్కు 2014లోనే పెళ్ళయిందా.?
[Nagarjuna Comments On Pan India Movies, Nagarjuna 100th Movie, King 100 Movie, Akkineni Nagarjuna, Itllu Arjuna, Pan India Movies, Telugu Film News]






