సుధీర్ బాబు చిత్రాలు
on May 23, 2012
ప్రముఖ హీరో సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, ప్రిన్స్ మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు ఇటీవల "యస్.యమ్.యస్." చిత్రంతో హీరోగా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించాడు. తదనంతరం ఆయన కథలు వినటంలో, కథల ఎంపికలో బిజీగా ఉన్నారు. అలా విన్న కథలలో "అగ్గిపుల్ల" అనే కథ ఆయనకు బాగా నచ్చిందట.
గతంలో "రక్ష" చిత్ర దర్శకుడు వంశీ కృష్ణ ఈ "అగ్గిఉల్ల" చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అలాగే "ఈ రోజుల్లో" ఫేం మారుతి దర్శకత్వంలో "గాలి" అనే సినిమాలో కూడా సుధీర్ బాబు నటించటానికి అంగీకరించారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఈ రెండు చిత్రాలు గనక హిట్టయితే సుధీర్ బాబు హీరోగా తెలుగు చలనచిత్ర సీమలో నిలదొక్కుకున్నట్లే...!