సినిమా ఫ్లాపయితే ఆనందించిన రాము
on May 23, 2012
సినిమా ఫ్లాపయితే ఎవరైనా బాధపడతారు. హిట్టయితే ఆనందిస్తారు. కానీ ఇక్కడ ఒక దర్శకుడు రివర్స్ లో ఫీలవుతున్నాడు. తాను తీసిన చిత్రం ఫెయిలయినందుకు అతను సంతోషిస్తున్నాడు. అతను మరెవరో కాదు...అనునిత్యం వివాదాలలో మునిగి తేలే రామ్ గోపాల వర్మ. రాము ఇటీవల దర్స్ఘకత్వం వహించిన "డిపార్ట్ మెంట్" చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాపయింది.
ఈ చిత్రాన్ని కేనన్ 5డి కెమెరాతో తీస్తున్నప్పుడే ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించిన సంజయ్ దత్ తన అసంతృప్తిని వ్యక్తపరిచాడట. ఈ చిత్రం ఫ్లాపవగానే "ఇంకెప్పుడూ రాము సినిమాలో నటించను" అని ప్రకటించాడు సంజయ్ దత్. దానికి ప్రతిగా స్పందిస్తూ "డిపార్ట్ మెంట్" ఫ్లాపయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంకెప్పుడూ సంజయ్ దత్ ముఖం చూడక్కర లేదు" అని అన్నాడట రామ్ గోపాల వర్మ. దటీజ్ వర్మ....!