Home

»

Latest News

‘వార‌ణాసి’లో మ‌హేష్ పెర్‌ఫార్మెన్స్‌పై రాజ‌మౌళి షాకింగ్ కామెంట్స్ వైరల్.!

Oct 20, 2026 3:40PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, పౌరాణిక అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మహేశ్ నటన గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేశ్ బాబు నుంచి తాను 100 శాతం ప్రతిభను ఆశిస్తే.. ఆయన ఏకంగా 200 శాతం ప్రతిభను చూపించారని రాజమౌళి ప్రశంసించారు. మహేశ్ నటనా సామర్థ్యం గురించి తనకు ముందే తెలుసని, అయితే ఆయనతో కలిసి పనిచేయడం ప్రారంభించిన తర్వాత తన అంచనాలను మించి నటించారని చెప్పారు. రుద్ర పాత్రలో మహేశ్ ఒదిగిపోయిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని, ఆయనతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవమని పేర్కొన్నారు.

సినిమాల్లో నటీనటులను ఎంపిక చేసేటప్పుడు కేవలం వారి స్టార్‌డమ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోనని రాజమౌళి తెలిపారు. కథలోని పాత్రకు ఎవరు సరిపోతారో వారినే ఎంపిక చేసుకుంటానని వివరించారు. నటీనటులు తనపై నమ్మకం ఉంచితే, ఆ పాత్రకు అవసరమైన నటనను వారి నుంచి రాబట్టేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు తన అంచనాలను మించి నటించి తనను సర్‌ప్రైజ్ చేశారని వెల్లడించారు.

ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘వారణాసి’ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. మహేశ్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. వెండితెరపై రుద్రగా మహేశ్ ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారో చూడాలి.

 


[SS Rajamouli, Mahesh Babu, Varanasi Movie, Rajamouli Praises Mahesh Babu, Mahesh Babu Rudhra, Varanasi Movie Updates, Priyanka Chopra, Prithviraj Sukumaran, Varanasi Release Date]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com