Home

»

Latest News

హీరో శ్రీ‌కాంత్ కుమార్తె మేథ హీరోయిన్‌గా ఎంట్రీ.. హీరో ఎవ‌రంటే..?

Oct 12, 2026 11:40AM

టాలీవుడ్‌లో మరో స్టార్ వారసురాలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, నటి ఊహ దంపతుల కుమార్తె మేధ మేకా కథానాయికగా పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ కొత్త ప్రేమకథను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో ‘రాజమండ్రి రోజ్ మిల్క్’తో గుర్తింపు పొందిన జై జాస్తి హీరోగా నటిస్తున్నారు. ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్‌తో పేరు తెచ్చుకున్న పృథ్వీ వనం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్ర దర్శకుడు పి.మహేశ్ బాబు ఈ ప్రాజెక్టుకు క్రియేటర్‌/షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాను #MythriInLove అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రమోట్ చేస్తున్నారు.

మేధకు సినిమాలు కొత్తేమీ కాదు. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ చిత్రంలో చిన్నప్పటి రుద్రమదేవిగా ఆమె నటించారు. అప్పట్లో బాలనటిగా కనిపించిన మేధ.. ఇప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ కుమారుడు రోషన్ ‘పెళ్లి సందD’, ‘ఛాంపియన్’ వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇప్పుడు మేధ కూడా కథానాయికగా అడుగుపెడుతుండటంతో ఈ కుటుంబం నుంచి మరో నటిని టాలీవుడ్‌కు పరిచయం చేసినట్లయింది.

ఈ కొత్త ప్రేమకథకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను అక్టోబర్ 12, 2026న ఉదయం 10:26 గంటలకు విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. జై జాస్తి, మేధ జంటగా ఎలా కనిపించబోతున్నారు? ఈ ప్రేమకథతో మేధ హీరోయిన్‌గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

[Srikanth Daughter Medha, Medha Meka Heroine Debut, Srikanth Ooha Daughter, Mythri Movie Makers, Mythri In Love Movie, Jai Jasti, Prithvi Vanam Director, Medha Rudhramadevi, Tollywood Star Kids, Telugu Movie News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com