పెద్దిపై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు: జాన్వీ వివాదంపై ఎవరి తరుపు మాట్లాడిందో తెలుసా!
Nov 24, 2026 9:55AM

బడా హీరోలకి బ్లాక్ బస్టర్ వచ్చేలా చేసే గోల్డెన్ లెగ్ భామ శృతి హాసన్ ప్రెజెంట్ 'ఆకాశంలో ఒక తార' తో థియేటర్స్ లో సందడి చేస్తూ ఉంది. రోహిణి గా అల్ట్రా మోడల్, జెన్ జి బ్యాచ్ సైతం అసూయపడేంత స్టైల్ తో రఫ్ఫాడించడంతో పాటు మూవీ విజయానికి ఒక కారణంగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
రీసెంట్ గా శృతి ఆకాశంలో ఒక తారకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ముందుకు ‘పెద్ది’ మూవీలోని పాట చుట్టూ నెలకొన్న వివాదం, జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావనకి వచ్చింది. అప్పుడు ఆమె మాట్లాడుతూ . ఇతరుల వ్యక్తిగత అనుభవాల గురించి తాను మాట్లాడటం సరైన పద్ధతి కాదని, మూవీలో నటించిన హీరోయిన్లకి ఎదురైన పరిస్థితులు, వారి అనుభవాలు తనకి పూర్తిగా తెలియవని చెప్పుకొచ్చింది. అందుకే వారి తరఫున తాను మాట్లాడలేనని, అలాగే తన వ్యక్తిగత అనుభవాల గురించి కూడా ఇతరులు మాట్లాడలేరని పేర్కొంది. దీంతో ఈ వివాదంపై ఎలాంటి తీర్పు ఇవ్వకుండా శ్రుతి తన అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించింది.
మరోవైపు ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణాన్ని కూడా శ్రుతిహాసన్ వివరించింది. గతంలోనూ తాను ఇలాంటి పాటల్లో నటించానని, డ్యాన్స్ చేయడం, అందంగా ముస్తాబవడం, గ్లామరస్ లుక్‌లో కనిపించడం తనకు ఇష్టమైన విషయాలని అయితే కేవలం ప్రేక్షకులని లేదా ఇతరులను మెప్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి పాటలు చేయనని స్పష్టం చేసింది. తనకు నచ్చినప్పుడే, తాను సౌకర్యంగా భావించినప్పుడే అలాంటి పాత్రలు, పాటల్లో కనిపిస్తానని, నచ్చని దుస్తులు ధరించడం లేదా ఇష్టం లేని పనులు చేయడం తనకు అలవాటు లేదని తన వైఖరిని వెల్లడించింది. శ్రుతిహాసన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఒక సినిమా విషయంలో మరో నటి ఎదుర్కొన్న అనుభవంపై తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని స్పష్టమవుతోంది. అదే సమయంలో స్పెషల్ సాంగ్స్ చేయడం తన వ్యక్తిగత ఎంపిక అని చెప్పడం ద్వారా తన నిర్ణయాలపై క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి ‘పెద్ది’ పాట వివాదంపై శ్రుతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.



