
హాలీవుడ్‌లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ప్రముఖ నటి సెల్మా బ్లెయిర్ విమాన ప్రయాణంలో సృష్టించిన బీభత్సం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. లాస్ ఏంజెలెస్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ (Delta Air Lines) విమానంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో ఆమె ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురై విమాన సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి దిగడంతో ప్రయాణికులంతా ఖంగుతిన్నారు.
విమానంలో ఉన్న ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లపై ఆమె భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా, వారిని కొరికినట్లు ఫిర్యాదులు అందడం గమసార్హం. ఈ హఠాత్పరిణామంతో విమానంలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి న్యూయార్క్‌లోని ప్రఖ్యాత జాన్ ఎఫ్. కెన్నెడీ (JFK) అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే, భద్రతా సిబ్బంది మరియు పోలీసులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. విమానంలో ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించి, సిబ్బందిని గాయపరిచిన ఆరోపణలతో 54 ఏళ్ల నటి సెల్మా బ్లెయిర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లలో ఒకరిని మెరుగైన వైద్య పరీక్షలు మరియు చికిత్స నిమిత్తం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించే క్రమంలో లేదా వైద్య పరీక్షల సమయంలో ఆమె అక్కడ విధుల్లో ఉన్న నర్సుపై, అలాగే పోలీసు అధికారులపై కూడా దురుసుగా ప్రవర్తించి దాడికి యత్నించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: రాజాసాబ్ ఎందుకు ప్లాప్ అయ్యిందో చెప్పేసిన నిర్మాత: డార్లింగ్ ఫ్యాన్స్ వింటే షాక్ అవుతారు!

ఈ పరిణామాల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు ఈ ఘటనపై కూలంకషంగా దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ వివాదంపై సెల్మా బ్లెయిర్ ప్రతినిధులు మరియు న్యాయవాది స్పందిస్తూ.. ప్రయాణ సమయానికి ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆ సమయంలో ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కోర్టుకు వివరణ ఇచ్చారు. విరామం లేకుండా ఎక్కువ గంటలు పనిచేయడం, తీవ్రమైన అలసట, మరియు గతంలో ఆమెకి తగిలిన గాయాల ప్రభావం వల్లనే ఆమె అలా ప్రవర్తించి ఉండవచ్చని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని వారు వాదించారు.
[Selma Blair Flight Arrest Chaos,Selma Blair, Selma Blair flight arrest, Hollywood actress news, Delta Air Lines incident, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






