
జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్ ప్రారంభం కానుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. సహజమైన నటనతో, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి.. ఈ షో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. మనసులోని మాటలను నిక్కచ్చిగా బయటకు తెలిజయేసే సంభాషణలు, వ్యక్తిగత జ్ఞాపకాలు, ఆసక్తికరమైన విషయాలు, వినోదభరితమైన విశేషాలతో ఈ కొత్త సీజన్ ప్రేక్షకులను అలరించనుంది.
ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో.. వెండితెరపై కనిపించే తారల వ్యక్తిగత జీవితాల్లోని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తొలి సీజన్‌లో అక్కినేని నాగార్జున, శ్రీలీల వంటి ప్రముఖులు అతిథులుగా పాల్గొని, తమ వ్యక్తిగత జీవిత విశేషాలు, సినీ ప్రయాణం, అనుబంధాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
హోస్ట్ జగపతిబాబు, సెలబ్రిటీల మధ్య జరిగే సహజమైన సంభాషణలే ఈ షోకు ప్రధాన ఆకర్షణ. తమ జీవితాలను మలుపు తిప్పిన అనుభవాలు, ఇప్పటివరకు పెద్దగా బయటకు రాని జ్ఞాపకాలు, తమ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, మరచిపోలేని సంఘటనల గురించి సెలబ్రిటీలు మనసు విప్పి మాట్లాడే అవకాశం ఈ షో కల్పిస్తోంది. ఇప్పుడు రెండో సీజన్ కూడా ఇదే ప్రత్యేకమైన సంభాషణల శైలిలో మరిన్ని వ్యక్తిగత విశేషాలు, ఆసక్తికరమైన ముచ్చట్లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

జయమ్ము నిశ్చయమ్మురా కొత్త సీజన్ సాయి పల్లవితో ప్రారంభం కానుంది. సహజత్వానికి ప్రాధాన్యమిస్తూ, భావోద్వేగాలతో పాటు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలతో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రామాయణ’ చిత్రంలో సీతగా సాయి పల్లవి ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌లో సాయి పల్లవి, జగపతిబాబుతో కలిసి ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా మాట్లాడబోతున్నారు. తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జ్ఞాపకాలు, ఇప్పటివరకు ప్రేక్షకులకు పెద్దగా తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె ఈ సందర్భంగా తెలియజేయనున్నారు. ఆమె వ్యక్తిత్వం, ఆలోచనలు, జీవితంలో ఎదురైన అనుభవాల గురించి తెలుసుకునే అవకాశం ఈ ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకులకు లభించనుంది.
‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్ అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అక్టోబర్ 18, ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగులో టెలివిజన్ ప్రసారం కానుంది. తొలి ఎపిసోడ్‌లో సాయి పల్లవి సందడి చేయనుండటంతో ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత బోల్డ్ ఫోటోషూట్.. అక్కినేని కోడలి కొత్త ఫోటోలు వైరల్.!
[Jayammu Nischayammu Raa Season 2, Jayammu Nischayammu Raa with Jagapathi, Jagapathi Babu, Sai Pallavi, Ramayana Movie, Jayammu Nischayammu Raa, Telugu Film News]





