Home

»

Latest News

Sathyaraj: కట్టప్ప కూతురు దివ్య సత్యరాజ్ సీక్రెట్ పెళ్లి!.. అసలు ట్విస్ట్ వింటే షాక్ అవుతారు

Jun 4, 2026 2:29PM

 

'బాహుబలి'కట్టప్ప సత్యరాజ్ కుమార్తె పేరు దివ్య సత్యరాజ్. గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్ వేదికల్లో దివ్య సత్యరాజ్ పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న కొన్ని ఫోటోలు సర్క్యులేట్  అవుతున్నాయి. ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమెకు అత్యంత వైభవంగా వివాహం జరిగిందని, కేవలం 50 మంది అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక రహస్యంగా ముగిసిందంటూ కొన్ని తమిళ వెబ్‌సైట్లు కథనాలను కూడా ఇచ్చారు. ఈ న్యూస్  క్షణాల్లో వైరల్ అవ్వడంతో అభిమానులు, నెటిజన్లు సత్యరాజ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలపడం ప్రారంభించారు. అయితే, ఈ హడావుడి అంతా చూసి షాక్‌కు గురైన సత్యరాజ్ కుటుంబం వెంటనే ఈ వ్యవహారంపై స్పందించింది

 నా కుమార్తె దివ్య సత్యరాజ్ పెళ్లి జరిగిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పెళ్లి ఫోటోలు 100 శాతం నకిలీవి. టెక్నాలజీని తప్పుడు పద్ధతిలో వాడుకుని ఎవరో ఆ ఫోటోలని క్రియేట్ చేశారు. బాధ్యతారాహిత్యంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై, ఫేక్ ఫోటోలని  వైరల్ చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లపై  సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also read: Janhvi Kapoor: పెద్ది రిలీజ్... 3555 మెట్లు ఎక్కిన జాన్వీకపూర్

 దివ్య సత్యరాజ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ గా సేవలందిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ పెళ్లి కాకుండానే ఒక బిడ్డకి జన్మనివ్వడంలో తప్పు లేదు. పెళ్లి కంటే లివింగ్ రిలేషన్ బెస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com