Home

»

Latest News

Janhvi Kapoor: పెద్ది రిలీజ్... 3555 మెట్లు ఎక్కిన జాన్వీకపూర్

Jun 4, 2026 12:55PM

'

'పెద్ది'(Peddi)తో కలిసి అచ్చాయమ్మాగా జాన్వీ కపూర్(Janvi kapoor)సందడి చేస్తుంది. తన క్యారక్టర్ నిడివి పెద్దగా లేదనే టాక్ వస్తున్నా కథకి తగట్టుగా మేకర్స్ తనపై ఉంచిన నమ్మకానికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసిందనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది.   


రిలీజ్ ని పురస్కరించుకొని జాన్వీ తన సెంటిమెంట్‌ని మరోసారి చాటుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం  దర్శించుకున్నారు. తన జీవితంలో ఏ చిన్న ముఖ్యమైన ఘట్టం ఉన్నా, సినిమా రిలీజ్ ఉన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జాన్వీ కపూర్‌కి  తన తల్లి, అతిలోక సుందరి శ్రీదేవి నుంచి వచ్చిన  అలవాటు. అయితే ఈ సారి 'పెద్ది' సినిమా సాధిస్తున్న భారీ ఓపెనింగ్స్, సక్సెస్ నేపథ్యంలో ఆమె బుధవారం రాత్రి వేళలోనే తిరుపతి అలిపిరి పాదాల చెంతకి  చేరుకున్నారు. 

 ఎలాంటి హంగూ,ఆర్భాటాలు లేకుండా ఒక సాదాసీదా భక్తురాలిలా కాలినడక ప్రయాణాన్ని ప్రారంభించారు. తిరుమల కొండకు చేరుకోవడానికి అలిపిరి మార్గంలో ఉన్న మొత్తం 3,555 మెట్లని ఆమె చెప్పులు లేకుండా  కాలినడకన ఎక్కడం విశేషం. తెల్లవారుజామున సాగిన ఈ ప్రయాణంలో జాన్వీ చాలా సింపుల్ కుర్తా పైజామా ధరించి, జుట్టును ముడేసుకుని, ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని సాధారణ యాత్రికురాలిలా మెట్లు ఎక్కుతూ కనిపించారు. దారి మధ్యలో అలసట వచ్చినప్పుడు ఒక అరుగుపై ప్రశాంతంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న అన్‌సీన్ వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. ఆమెతో పాటు ప్రముఖ సినీ నటి, తన బంధువు, గులాబీ మూవీ ఫేమ్ మహేశ్వరి కూడా జాన్వీ తో పాటు ఉన్నారు.

also read: ప్రకాష్ రాజ్ పై బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్. నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడిగవా!

తిరుమల చేరుకున్న అనంతరం వీఐపీ విరామ సమయ దర్శనంలో జాన్వీ శ్రీవారిని దర్శించుకున్నారు. గర్భగుడిలోని మూలవిరాట్‌ని  దర్శించుకుని, 'పెద్ది' చిత్రం అఖండ విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆమెకి  తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలని  అందజేశారు. పెద్ది రిలీజ్ రోజునే జాన్వీ తిరుమల కొండకి  కాలినడకన రావడంపై మెగా అభిమానులు, జాన్వీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దికి నిన్న ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వస్తుంది.  

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com