Home

»

Latest News

బిగ్ డీల్: ‘ఈగో రాజా’ ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న సరిగమ.!

Oct 10, 2026 6:14PM

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ రూట్ మార్చేసి డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటారు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’  సినిమాపై ట్రేడ్ సర్కిళ్లలో మంచి బజ్ నెలకొంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. 

ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆడియో హక్కులకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ప్రకటించారు. ‘ఈగో రాజా’ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో టీం బిజీగా ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రాబోతోన్న ఈ మూవీ ఆడియో రైట్స్‌‌ని సరిగమ సంస్థ భారీ రేటుకి సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. దురైరాజ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు.

 

 

[Ego Raja Audio Rights, Ego Raja Movie, Aadi Saikumar, SaReGaMa, Shambhala, Telugu Songs, Telugu Film News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com