
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఏదైనా కొత్త న్యూస్ వస్తే ఆనందపడని తెలుగువారు ఉండరు. ఆ మాట కొస్తే ఆ కొత్త న్యూస్ సైతం ఆనందంతో పులకరించిపోతుంది. ఈ కోవలోనే తాజాగా చిరు 10 th క్లాస్ సర్టిఫికెట్ వైరల్ హోదాలో తన సత్తా చాటుతూ ఉంది
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఆ సర్టిఫికెట్ ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి పూర్తి అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్ రావు (K.S.S. Vara Prasad Rao) గా స్పష్టంగా ముద్రించబడి ఉంది. ఆ పత్రంలో ఆయన తండ్రి పేరు కొణిదెల వెంకట రావు అని, పుట్టిన ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండగా నమోదు చేయబడి ఉంది. అలాగే ఆయన పుట్టిన తేదీ ఆగస్ట్ 22, 1955 అని ఆ సర్టిఫికెట్ ద్వారా మరోసారి స్పష్టమైంది. చిన్నతనంలో చదువులోనూ ఎంతో ప్రతిభ కనబరిచిన చిరంజీవి, అప్పట్లో టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారని మెగా అభిమానులు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: కాకాతో ఆల్ టైం రికార్డ్స్ ఖాయం!

ప్రస్తుతం చిరు 'కాకా'తో ముస్తాబవుతున్న విషయం తెలిసిందే.
[Chiranjeevi 10th Class Certificate Viral, Chiranjeevi 10th Class Certificate, megastar chiranjeevi original name, chiranjeevi 10th class certificate, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]






