
కార్తీ , దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కాంబోలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' నిన్న వరల్డ్ సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయ్యింది. ఆ ఇద్దరి కాంబోలోనే వచ్చిన సర్దార్ కి సీ క్వెల్ కావడంతో అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు సర్దార్ ని మించి ఉంటుందని కోటి సినీ ఆశలతో థియేటర్స్ కి తరలి వెళ్లారు. కానీ సెకండ్ హాఫ్, క్లైమాక్స్ దెబ్బకొట్టాయనే అభిప్రాయాన్ని వాళ్లంతా వ్యక్తం చేస్తున్నారు.
తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా 6.80 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. అందులో ఇండియా గ్రాస్ వసూళ్లు 5.30 కోట్లు కాగా, ఓవర్సీస్ వసూళ్లు 1.50 కోట్ల గ్రాస్ గా నిర్ధారించారు. ఒక రకంగా ఈ కలెక్షన్స్ కార్తీ గత డిజాస్టర్స్ చిత్రాలతో పోల్చుకుంటే ఎక్కువే అని చెప్పవచ్చు. మొత్తం 3,950 షోలతో ప్రదర్శితమవ్వగా, సగటున 24.5% ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళ వెర్షన్ 2,548 షోలతో 2.60 కోట్ల నెట్ వసూలు చేసి 22% ఆక్యుపెన్సీ నమోదు చేయగా, తెలుగు వెర్షన్ కేవలం 1,402 షోలతోనే1.90 కోట్ల నెట్ కలెక్షన్ సాధించడం విశేషం. పైగా, తెలుగు రాష్ట్రాల్లో 29% ఆక్యుపెన్సీ నమోదైంది, ఇది తమిళ వెర్షన్ ఆక్యుపెన్సీ కంటే మెరుగ్గా ఉండడం కార్తికి తెలుగులో ఉన్న క్రేజ్ ని మరోసారి రుజువు చేసింది.
.webp)
Also Read: ఎపిక్.. ఆ విషయంలో కరెక్ట్ అంటున్న ప్రేక్షకులు!
మరి టాక్ సంగతి పక్కన పెడితే వినాయక చవితి పండగ మూడ్ స్టార్ట్ కావడం, వీకెండ్ కి అదనపు సెలవలు కూడా తోడు కావడాన్ని సర్దార్ ఉపాయించుకుంటాడో లేదో చూడాలి. ఎస్.జె. సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కీ రోల్స్.
[Sardar 2, karthi, Sardar 2 First Day Collections, Telugu Cinema News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema]






