భార్య అనారోగ్యానికి గురైతే భర్త వదిలేస్తున్నాడు..అరవైవేల మందిలో నేను ఒకదాన్ని
on Apr 21, 2025
'సమంత'(Samantha)గత ఏడాది సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టకపోయినా 'సిటాడెల్ హనీబన్నీ' అనే హిందీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని అలరించింది. తనకున్న హెల్త్ ఇష్యుస్ ని సైతం పక్కన పెట్టేసిన సమంత ఈ సిరీస్ లో ఎన్నో రిస్క్ ఫైట్స్ లు చేసి తన సత్తా చాటిందని చెప్పవచ్చు. ప్రస్తుతం 'మా ఇంటి మహాలక్ష్మి' అనే మూవీతో పాటు 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ చేస్తుండగా మూవీకి అయితే తనే నిర్మాతగా వ్యవహరిస్తోంది.
రీసెంట్ గా 'సక్సెస్ వెర్స్' అనే ఇనిస్టాగ్రా ఖాతాలో భార్య అనారోగ్యానికి గురయితే పురుషుడు ఆమెని వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ భర్త అనారోగ్యానికి గురైతే భార్య మాత్రం వదిలెయ్యడానికి ఇష్టపడటం లేదు. భార్యతో భర్తకి ఎమోషనల్ ఎటాచ్ మెంట్ లేకపోవడం వల్లే విడిచిపెట్టాలనుకుంటున్నాడని సర్వేల్లో తేలిందని సక్సెస్ వెర్స్ లో పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ కి సమంత లైక్ చేసింది. మరో అరవై వేల లైక్స్ కూడా వచ్చాయి.
సమంత 2017 లో అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2021 లో ఆ ఇద్దరు విడిపోయారు. ఆ మరుసటి సంవత్సరమే తాను మయాసైటీస్ అనే ఒక అరుదైన వ్యాధి కి గురయ్యానని సమంత చెప్పింది. దీంతో సమంత లైక్ కొట్టడంపై అందరు చర్చించుకుంటున్నారు. సమంత చాలా సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
