పుష్ప 2 వల్ల నష్టపోయిన జాబితా ఇదే
on Apr 21, 2025
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun)వన్ మ్యాన్ షో పుష్ప 2 (Pushpa 2)డిసెంబర్ 4 న వరల్డ్ వైడ్ గా విడుదలై ఎంతగా సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ముఖ్యంగా హిందీలో అయితే స్ట్రెయిట్ హిందీ సినిమా కూడా సాధించలేని విధంగా 800 కోట్ల వసూళ్ళని సాధించి చరిత్ర తిరగరాసింది. దీన్నిబట్టి నార్త్ ఆడియెన్స్ పుష్ప 2 కి ఎంతగా బ్రహ్మరధం పట్టారో అర్ధం చేసుకోవచ్చు. పైగా లోకల్ సినిమాని కూడా అక్కడి ప్రేక్షకులు పట్టించుకోలేదు.
రీసెంట్ గా ఇదే విషయంపై ప్రముఖ బాలీవుడ్ యువహీరో ఉత్కర్ష్ శర్మ(Utkarsh Sharma)మాట్లాడుతు మా 'వనవాస్'(Vanvaas)మూవీ రిలీజ్ డేట్ విషయంలో మేమంతా ఇంకోసారి ఆలోచించాల్సింది. అలా చెయ్యకుండా పుష్ప 2 సమయంలోనే మా మూవీని రిలీజ్ చేసాం. దీంతో ప్రేక్షకులకి మా మూవీ చేరుకొనేలోపే స్క్రీన్స్ దొరక్క చనిపోయింది. ఫస్ట్ వీక్ బాగానే టాక్ వచ్చినప్పటికీ సరైన స్క్రీన్స్ లేకపోవడంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. దాని వల్లే మా చిత్రానికి ఆశించినంత వసూళ్లు రాలేదు. ఒకేసారి రెండు మూడు కొత్త చిత్రాలని ప్రేక్షకులు చూడటానికి మన దగ్గర కావలసిన స్క్రీన్స్ లేవని నా అభిప్రాయం. ఈ కారణం వల్లే కొన్ని మాత్రమే పోటీలో నిలవ గలుగుతున్నాయి.
కాకపోతే ఓటిటి లో స్క్రీన్స్ ప్రాబ్లమ్ లేదు. కాబట్టి మా సినిమా ఓటిటి లో ప్రేక్షాదరణతో బాగా ఆడింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన 'వనవాస్' డిసెంబర్ 20 న థియేటర్స్ లో రిలీజవ్వగా ఉత్కర్ష్ శర్మ తో పాటు లెజండ్రీ యాక్టర్ నానా పటేకర్, సిమ్రత్ కౌర్, రాజ్ పాల్ యాదవ్, ఖుష్బూ, తదితరులు కీలక పాత్రలు పోషించారు. గదర్, గదర్ 2 , వీర్, సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రాల ఫేమ్ అనిల్ శర్మ(Anil Sharma) దర్శకుడిగా వ్యవహరించాడు. జీ స్టూడియోస్ నిర్మాణ సారధ్యం వహించగా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 5 .61 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
