TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

రాగి ఇడ్లీ.. బాదం చట్నీ.. సమంత తాలింపు!

Jun 11, 2020 6:39PM

 

లాక్‌డౌన్‌లో స్టార్‌ హీరోయిన్‌ సమంత ఏం చేస్తున్నారు? ఆన్‌లైన్‌లో యాక్టింగ్‌ క్లాసులు వింటున్నారు. యాక్టింగ్‌లో ఇంకా ఇంప్రూమెంట్‌ కోసం ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ తాను బెటర్‌ యాక్టర్‌ కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు డిలీట్‌ చేస్తానని శపథం చేశారు. సమంత ఇంకా ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారు. టెర్రస్‌ మీద కుండీలు ఏర్పాటు చేసి వెజిటెబుల్స్‌ సాగు చేస్తున్నారు. ఆకుకూరలు, కాయగూరలు పండిస్తున్నారు.

సమంత ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు? కొత్తగా వంట చేయడం నేర్చుకుంటున్నారు! నిజమే... సమంత ఇప్పుడు వంట చేస్తున్నారు. రాగి ఇడ్లీ, మామిడికాయతో బాదం–కొబ్బరి చట్నీ చేశారు. స్పెషల్‌ తాలింపు కూడా! రీసెంట్‌గా అక్కినేని కోడలు నేర్చుకున్న వంటకాలివే. ‘‘ఇండియన్‌ ఫుడ్‌  ఐటమ్స్‌ నాకు నచ్చాయి. మిలెట్స్‌తో చేసే వంటలు మీకూ నచ్చుతాయి’’ అని సమంత పేర్కొన్నారు. ముద్దుల శ్రీవారు నాగచైతన్యకు సమంత ఇంకా ఏమేం వండి పెడతారో?? వెయిట్‌ అండ్‌ సీ!!

google-ad-img