TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఈసారైనా రవితేజకి 'రీమేక్ మల్టీస్టారర్' వర్కౌట్ అవుతుందా?

Jun 11, 2020 6:46PM

 

చిన్న చిన్న వేషాల నుండి స్టార్ హీరోగా ఎదిగిన వైనం మాస్ మహరాజా రవితేజ సొంతం. నటుడిగా 30 ఏళ్ల ప్రస్థానంలో పలువురు కథానాయకులతో కలిసి నటించాడు రవితేజ. అయితే స్టార్ హీరోగా టర్న్ అయ్యాక మాత్రం మల్టీస్టారర్ చిత్రాలకు కాస్తంత దూరంగానే ఉంటున్నాడు.

అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితం 'శంభో శివ శంభో' (2010) అంటూ ఓ మల్టీస్టారర్ చేశాడు రవితేజ. అందులో 'అల్లరి' నరేష్‌, శివబాలాజీతో జట్టుకట్టాడు. కోలీవుడ్ హిట్ మూవీ 'నాడోడిగ‌ళ్‌' ఆధారంగా రూపొందిన ఈ మల్టీస్టారర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. దీంతో రవితేజ మళ్ళీ మల్టీస్టారర్ వైపు కన్నెత్తి చూడలేదు.

కట్ చేస్తే.. ప‌దేళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం మరో మల్టీస్టారర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట‌ రవితేజ. విశేష‌మేమిటంటే.. ఇది కూడా ఓ రీమేక్ ఫిల్మ్ కావ‌డం. కాక‌పోతే ఈసారి ఓ మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ మల్టీస్టారర్ రూపొందనుండ‌డం విశేషం. పృథ్వీరాజ్, బిజు మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' ఆధారంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఇందులో రవితేజ, రానా కలిసి నటించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఆగస్టు నుంచి చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది.

మరి.. రవితేజ ప్రీవియస్ మల్టీస్టారర్ మూవీ 'శంభో శివ శంభో' ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో.. నయా మల్టీస్టారర్ మూవీ అయినా కమర్షియల్ హిట్‌ను అందిస్తుందేమో చూడాలి.

google-ad-img