
మరోసారి పెద్దిలో వన్ మాన్ షో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మ్ ప్రదర్శించి హిట్ అందుకున్న రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీని 'సుకుమార్' డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. రంగస్థలం కాంబో కావడంతో అంచనాలని లెక్కెట్టడం ఎవరి వల్ల సాధ్యం కానీ పని. చరణ్ చేస్తున్న 17 వ చిత్రం కావడంతో 'RC17' అనే నామధేయంతో ట్రెండింగ్ లో ఉంది.
ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ విజన్ కేవలం భారతీయ సినిమాకే పరిమితం కాకుండా విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్ రోల్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మునుపెన్నడూ చూడని రీతిలో డిజైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే చరణ్ క్యారెక్టర్ లుక్, కాస్ట్యూమ్స్ , మేకోవర్ కోసం ఏకంగా హాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ 'జార్జియో అర్మానీ'ని రంగంలోకి దించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్త నెట్టింట దూకుడు ప్రదర్శిస్తుంది. సాధారణంగా సుకుమార్ తన చిత్రాల్లో హీరోల క్యారెక్టరైజేషన్, కాస్ట్యూమ్స్ విషయంలో ఏమాత్రం రాజీపడరు. 'రంగస్థలం' లో చిట్టిబాబు మాస్ అవతారం, 'పుష్ప' లో అల్లు అర్జున్ రా అండ్ రఫ్ లుక్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు ఆ రెండింటికీ భిన్నంగా 'RC17' లో చరణ్ ని అత్యంత క్లాసీ, స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ గ్లోబల్ లుక్ లో ఆవిష్కరించబోతున్నారు.

Also Read: సంచలనం: రఘు మాస్టర్ పై పోలీస్ కేసు పెట్టిన జానీ మాస్టర్ వైఫ్ సుమలత
ఈ ప్రతిష్టాత్మక పాత్ర యొక్క స్పెషల్ ఫిజిక్ మరియు బాడీ లాంగ్వేజ్ కోసం రామ్ చరణ్ సుమారు 15 కిలోల వరకు బరువు తగ్గేందుకు సిద్ధమవుతున్నారు. చరణ్ కెరీర్‌లోనే ఇది మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ అల్ట్రా-స్టైలిష్ మేకోవర్‌గా నిలవబోతోంది. రాబోయే దసరా పండుగ శుభదినాన ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి, నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు పాన్ ఇండియా నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తుంది. సుమారు 300 కోట్ల బడ్జెట్ అనే టాక్ వినపడుతుంది.
[RC17, Giorgio Armani, Ram Charan,Sukumar, Makeover look, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]






