Home

»

Latest News

రామ్ చరణ్ సరసన ఈ సుందరీమణి జోడి: పాన్ ఇండియా షేక్!

Oct 24, 2026 12:05PM


కొన్ని కాంబినేషన్స్ అంతే సెల్యులాయిడ్ పైకి అడుపెట్టడానికి చాలా దినాలు ఉన్నా సరే, మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటిది కాంబో రామ్ చరణ్, సుకుమార్ కాంబో(RC 17 ). ఈ నెల 26 , గాని 27 గాని RC 17  స్టార్ట్ కాబోతుందని ప్రొడ్యూసర్ రవిశంకర్ నిన్న వెల్లడి చేసారు.


 చరణ్ సరసన 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ, తాజాగా ఈ రేసులోకి మరో బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ వచ్చి చేరడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఏకంగా రూ.203 కోట్లకు పైగా వసూళ్లతో దేశవ్యాప్తంగా యువతను ఊపేసిన 'సైయారా' సినిమా ఫేమ్ అనీత్ పద్దా పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. పంజాబ్ లోని అమృత్‌సర్‌లో జన్మించి, మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ ప్రారంభించిన అనీత్ పద్దా, 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై' వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'సైయారా' చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ద్వారా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టడంలో కీలక పాత్ర పోషించింది.  


ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం ఇంకో ఓజి కాబోతుందా! 

 


ఇప్పుడు అదే క్రేజ్‌తో రామ్ చరణ్ సరసన RC17 చిత్రంలో నటించేందుకు అనీత్ పద్దా రేసులో ముందున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్. అనీత్ పద్దా ఎంట్రీపై వస్తున్న ఈ తాజా రూమర్స్ మెగా అభిమానుల్లో భారీ చర్చకు దారితీశాయి. అయితే, ఈ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లేదా దర్శకుడు సుకుమార్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సారా అర్జున్ మరియు అనీత్ పద్దా ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, ఎవరని ఫైనల్ చేస్తారో చూడాలి. 

 

[RC 17 Heroine, Aneet Padda In RC 17, Ram Charan, Sukumar, RC17 movie, Aneet Padda, Saiyaara heroine, Mythri Movie Makers,TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com