
తమిళ సినీ, రాజకీయ క్లైమేట్ చూస్తుంటే ధనుష్ పొలిటికల్ పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. రీసెంట్ గా ఢిల్లీలో కొంత మంది రాజకీయ పెద్దలని కలిసి చర్చలు కూడా చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీవీకే కీలక నేత, మినిస్టర్ ఆధవ్ అర్జున మాట్లాడిన మాటలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
ఆధవ్ అర్జున మాట్లాడుతు '2029 సార్వత్రిక ఎన్నికల్లో లౌకిక మరియు సామాజిక న్యాయ కూటమి విజయాన్ని అడ్డుకోవడానికి కొందరు సరికొత్త నటులు ఢిల్లీకి వెళ్లి అక్కడ మకాం వేస్తున్నారు. ఏ నటుడు ఢిల్లీకి వెళ్లి ఎవరిని కలుస్తున్నాడో ప్రతి కదలికని నిశితంగా గమనిస్తున్నాం. తెర వెనుక ఏం జరుగుతుందో తమిళనాడు ప్రజలకు తెలియదని అనుకోవద్దని, కేవలం సినిమా పాపులారిటీతో ప్రజలను మోసం చేయలేరని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ సరసన ఈ సుందరీమణి జోడి!

టీవీకే సన్నద్ధత: రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, క్షేత్రస్థాయిలో మరియు బూత్ స్థాయిలో తమ టీవీకే (TVK) పార్టీ పటిష్టంగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విజయ్‌కు లేదా తమ పార్టీకి కొత్తగా వచ్చే వారెవరూ పోటీ కాబోరని ధీమా వ్యక్తం చేశారు. అయితే తన ప్రసంగంలో ధనుష్ పేరు ప్రస్తావించకపోయినా ధనుష్ అనే విషయం అర్థమవుతుందని తమిళ సినీ, పొలిటికల్ తంబీ టాక్.
[Dhanush Political Entry Tvk Remarks, Dhanush political entry, TVK party, Aadhav Arjuna remarks, Tamil Nadu politics, Dhanush Narpani Iyakkam, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






