Home

»

Latest News

ఏఆర్ రెహ్మాన్ పై రామభక్తులు, నెటిజెన్స్ ఫైర్!

Oct 26, 2026 10:58AM

వరల్డ్ వైడ్ గా 'రామాయణ' అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే సినీ ప్రియులు,ప్రేక్షకులు, రామ భక్తులు ఎంత ఎగైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారో అర్ధమవుతూ ఉంది. అదే టైంలో మేకర్స్ కూడా ప్రమోషన్స్ వేగం పెంచడంతో సినీ సర్కిల్స్ లో రామాయణ సందడి వాతావరణం చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏ ఆర్ రెహ్మాన్ సంగీత ప్రవాహం నుంచి  రీసెంట్ గా రిలీజైన సెకండ్ సింగిల్ 'మంగళ రంగ్' సాంగ్ సోషల్ మీడియాలో ఊహించని వివాదానికి, చర్చకి కేంద్రబిందువుగా మారింది.

 శ్రీరాముడు మరియు సీతాదేవిల పవిత్ర వివాహ మహోత్సవాన్ని, వారి దివ్య ప్రేమ ప్రయాణాన్ని కీర్తిస్తూ సాంగ్ రూపొందింది. ఈ సాంగ్ లో సూఫీ ఖవ్వాలీ తరహా బీట్స్ మరియు ట్యూన్లు ఉండటంతో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామాయణం లాంటి పవిత్రమైన హిందూ ఇతిహాసానికి ఇలాంటి సూఫీ శైలి సంగీతం ఏమాత్రం సరిపడదని, ఇది మన సాంస్కృతిక మూలాలకు మరియు సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని వారు విమర్శిస్తున్నారు.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్ల ప్రకారం, ఈ పాటలోని మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గతంలో చేసిన 'రాక్‌స్టార్' లేదా 'జోధా అక్బర్' సినిమాల్లోని 'కున్ ఫయా కున్' పాటను పోలి ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇది పూర్తిగా రీసైకిల్ చేసిన ట్యూన్ అని, పాటలోని కొన్ని భాగాలు ఇతర దక్షిణ భారత సినిమాల ట్యూన్లను గుర్తుకు తెస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

 వాల్మీకి రామాయణంలో ఇలాంటి సూఫీ స్టైల్ క్వవాలీ సంగీతాన్ని జొప్పించడం వల్ల అసలు సిసలైన భక్తి భావన దెబ్బతింటుందని, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ సరైన సాంస్కృతిక పరిశోధన చేయకుండా పాత ఫార్ములాలనే రిపీట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాముడి వంటి దైవిక పాత్రలకు, స్వచ్ఛమైన సంస్కృత శైలి లేదా శాస్త్రీయ సంగీతపు బాణీలను ఉపయోగిస్తే ఫలితం వంద రెట్లు మెరుగ్గా ఉండేదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.


ఇది కూడా చదవండి: స్టార్ హీరో సరసన కయదు: బిగ్ ఆఫర్ కొట్టేసింది భయ్యా!

 

అయితే మరోవైపు, ఈ పాటను మరియు ఏఆర్ రెహమాన్ పనితీరును ఇష్టపడే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే మద్దతుగా నిలుస్తున్నారు. అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ గాత్రం చాలా అద్భుతంగా ప్రాణం పోసిందని, సినిమాలోని విజువల్స్ ఈ వివాహ వేడుకను అత్యంత వైభవంగా కళ్లకు కట్టాయని సమర్థిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో 'మంగళ రంగ్' పాట మాత్రం నెట్టింట పెద్దయెత్తున రగడ సృష్టిస్తూ, ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రముఖ కవి కుమార్‌ విశ్వాస్ కలం నుంచి సదరు సాంగ్ పురుడు పోసుకుంది.

 

 

[Ramayana Mangal Rang Song Controversy, Ramayana Mangal Rang song, AR Rahman controversy, Ramayana movie music, Ranbir Kapoor Ramayana, Ramayana song backlash, Bollywood, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com