
కయదు లోహర్.. అందానికే అసూయ పుట్టేంత అందంతో పాటు అంతకంటే అందమైన పెర్ ఫార్మెన్స్ తో దూసుకుపోతూ ఉంది. ప్రీవియస్ చిత్రం ప్యారడైజ్ నే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ఈ అమ్మడి చేతులోకి ఒక బడా హీరో ప్రాజెక్ట్ వచ్చింది చేరినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బడా అంటే మాములు బడా కాదు. ఇది కనుక నిజమైతే తన హవాని ఇక ఎవరు ఆపకపోవచ్చు.
థలా 'అజిత్ కుమార్'. తమిళ చిత్ర పరిశ్రమని సుదీర్ఘ కాలంగా ఏలుతున్న స్టార్ కట్ అవుట్. కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘డేర్‌డెవిల్’ (Dare Devil) ఇప్పుడు సినిమా వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. అదిక్ రవిచంద్రన్ దర్శకుడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాతో అజిత్ సతీమణి, ప్రముఖ నటి షాలిని అజిత్ కుమార్ ‘బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్’ (Bravehearts Production) పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారడం విశేషం.

హీరోయిన్‌కి సంబంధించి కోలీవుడ్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలెంటెడ్ బ్యూటీ కయ దు లోహర్ (Kayadu Lohar) అజిత్ సరసన నాయికగా ఖరారైనట్లు తెలుస్తోంది. మొదట ఈ ప్రాజెక్ట్‌లో శ్రీలీల పేరు వినిపించినా, చివరికి కయదు పేరు తెరపైకి రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఇదే నిజమైతే కయదు సినీ కెరీర్ మరింత ప్రజ్వలిస్తుందనే విషయంలో ఎలాంటి డౌట్ ఉండక్కర్లేదు.
kayadu Lohar In Ajith Dare Devil, kayadu Lohar Latest News, Ajith Kumar, Dare Devil movie, Kayadu Lohar, Shalini Ajith, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News






