Home

»

Latest News

Mgr: తమిళుల ఆరాధ్య దైవం ఎంజిఆర్ పై నోరుజారిన రాజేంద్రప్రసాద్.. ఎందుకు మాట్లాడాడు

Mar 11, 2026

 

-ఎంజిఆర్ అంటేనే ఒక శక్తీ 
-అలాంటి వ్యక్తిపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలేంటి!
-ఆ మాటలు సబబేనా! 


ఎంజిఆర్(MGR).. ఎక్స్ పైరీ డేట్ లేని ఈ మూడు అక్షరాల గురించి విన్నా, చూసినా, చదివినా తమిళనాడు వ్యాప్తంగా ఏర్పడే ప్రకంపనలు మాములు స్థాయిలో ఉండవు. అంతలా సిల్వర్ స్క్రీన్ పై, రాజకీయ రంగంపై ఎంజీఆర్ ఒక పెద్ద చరిత్రనే సృష్టించాడు. ఆయన తరహా డ్రెస్ స్టైల్, మాట, నడక తీరుని అనునయిస్తూ ఎంటైర్ తమిళనాడు వీధుల్లో చాలా మంది  కనిపిస్తుంటారు. ప్రస్తుత రాజకీయాలు సైతం ఎంజీఆర్ అనే పేరు ప్రస్తావించకుండా నడవవు. టోటల్ ఇండియాలోనే సినీ రంగం నుంచి సిఎం అయిన మొదటి వ్యక్తి.  అంతటి సినీ, రాజకీయ సమ్మోహన శక్తీ ఎంజీఆర్ సొంతం. అలాంటి ఎంజిఆర్ గురించి మన నట కిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్(Rajendraprasad)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా నిలిచాయి. ఆ మాటలేంటో, ఎక్కడ చేసాడో చూద్దాం.

నిన్న భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ కల్చరల్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో రాజేంద్రప్రసాద్‌కి 2025 వ సంవత్సరానికి సంబంధించి 'కళాప్రపూర్ణ కత్తి కాంతారావు' జాతీయ పురస్కారంని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతు 'తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజిఆర్ గారు. అలాంటి వ్యక్తి కాంతారావు గారి జానపద చిత్రాలని చూసి వామ్మో వీడు ఎవడు ఇండియా మొత్తాన్ని కొట్టుకెళ్ళేవాడిలా ఉన్నాడని భయంతో ఉచ్చపోసుకున్నాడనే వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా నిలిచాయి.

also read: Gopinchand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి హిస్టారికల్ మూవీకి హీరోయిన్ ఫిక్స్. కరెక్ట్ జోడి నేనా!

కాంతారావు(Kantharao)గారి గురించి చెప్పుకుంటే తెలుగు సినిమా ఒడిలో దాగి ఉన్న మరో ఆణిముత్యం అనుకోవచ్చు. ఎన్నో జానపద చిత్రాల్లో నటించి ఆ జోనర్ కి స్టార్ మెటీరియల్ సొగసుల్ని అద్దాడు. కాంతారావు కత్తి పట్టుకునే స్టైల్ కూడా అభిమానుల్ని, ప్రేక్షకులని ఉర్రుతలుగించేది. ఎంజీఆర్ కూడా అనేక జానపద చిత్రాల్లో చేసి తన రేంజ్ ని పెంచుకున్నాడు. పూర్తి పేరు ఎం జి. రామచంద్రన్.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com