Home

»

Latest News

Trisha: క్షమాపణలు చెప్పిన అగ్ర హీరో.. త్రిష ఎఫెక్ట్    

Mar 09, 2026

 


-త్రిష చేసిన ట్వీట్ లో ఏముంది 
-ఆ హీరో చేసిన వ్యాఖ్యలు ఏంటి 
-గొడవ సద్దుమణిగిందా!

పేరుకే హీరోయిన్.. కానీ సిల్వర్ స్క్రీన్ పై నటించడం మొదలుపెడితే  మనకి తెలిసిన పక్కింటి అమ్మాయిలా మెస్మరైజ్ చెయ్యడం త్రిష(Trisha)పెర్ ఫార్మెన్స్ కి ఉన్న స్టైల్. ఆ అసెట్ తోనే రెండు దశాబ్డలపై నుంచి సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటు ఒక బ్రాండ్ సృష్టించుకుంది. కొన్ని రోజుల నుంచి త్రిష పేరు ఇండియన్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇళయ దళపతి విజయ్ కి భార్య సంగీత మధ్య జరుగుతున్న  విడాకుల ఇష్యునే అందుకు కారణం. రీసెంట్ గా విజయ్, త్రిష కలిసి ఒక వివాహ వేడుకకి హాజరు కావడంతో హాట్ టాపిక్ కాస్త నిత్యం మాట్లాడుకునే టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో త్రిష,ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ మధ్య జరిగిన పూర్తి మ్యాటర్ చూద్దాం.

విజయ్ తో  త్రిష వివాహానికి హాజరైన తర్వాత ఒక ఈవెంట్ లో పార్తీబన్ మాట్లాడుతు 'త్రిష కొన్ని రోజులు ఇంట్లో ఉంటేనే మంచిది. ఆమె బయటకి వస్తే ఎక్కడలేని సమస్యలు వస్తున్నాయని అన్నాడు. ఈ నేపధ్యంలో సదరు వ్యాఖ్యలపై త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ 'చేతిలో మైక్ ఉంది కదా అని మాట్లాడితే కామెడీ అవ్వదు. మూర్కత్వం అవుతుందని పోస్ట్ చేసింది. ఇప్పుడు పార్తీబన్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు నాకు పశ్చాత్తాపపడటం తప్ప మరో మార్గం లేదని ట్వీట్ చేసాడు.

also read: VIjay vs sangeetha: విజయ్ వైఫ్ సంగీత సంచలన నిర్ణయం.. బంపర్ ఆఫర్ ఎవరికీ 

నటుడుగా, దర్శకుడిగా తమిళ సినీ రంగంలో సుదీర్ఘ హిస్టరీ కలిగిన పార్తీబన్(R. Parthiban)తెలుగు సినీ ప్రేమికులకి కూడా సుపరిచయస్తుడే. మూడు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా నటుడు.   త్రిష, పార్తీబన్ లు లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి వచ్చిన పొన్నియన్ సెల్వం పార్ట్ 1 , పార్ట్ 2 లో చేసారు. 

 


  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com