అనసూయ టేబుల్ పై మందు బాటిల్, సోడా.. ఎనీ డౌట్స్
on May 15, 2024
యమదొంగ లో ఎనీ డౌట్స్ అనే ఎన్టీఆర్ డైలాగ్ బాగా పాపులర్. ఇప్పుడు ఆ మాట జబర్దస్త్ ఆర్టిస్ట్ అనసూయ(anasuya)కి పర్ఫెక్ట్ గా సూటవుతుంది. హండ్రెడ్ పర్సెంట్ సూటవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే తన నట విశ్వరూపాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులు చూడబోతున్నారు
నిన్న అనసూయ బర్త్ డే. తన 39 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఏ ముహూర్తాన సోగ్గాడే చిన్ని నాయన లో ఒక సాంగ్ చేసిందో గాని తన నట సోయగంతో తెలుగు ప్రేక్షకులని ఫ్లాట్ చేసి పడేసింది.ఇక అక్కడనుంచి సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటు వాల్యుబుల్ ఆర్టిస్ట్ గా మారింది. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మూవీ పుష్ప టూ (pushpa 2) లోచేస్తుంది.మేకర్స్ తన పుట్టిన రోజు సందర్భంగా అనసూయ లుక్ ని రిలీజ్ చేసారు. పక్కా విలేజ్ టైప్ చీర కట్టుతో నోట్లో పాన్ వేసుకొని ఒక టేబుల్ పై కూర్చొని ఉంది. దానిపై ఆల్కహాల్ బాటిల్, ఒక సోడా ఉన్నాయి. పక్కన అనుచరులు కూడా ఉన్నారు. తన ఫేస్ ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే చెప్పిన పని చెయ్యలేదని అనుచరుకులకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మూవీని ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అనే ఆత్రుతని కూడా అందరిలో కలిగిస్తుంది
పుష్ప పార్ట్ వన్ లో అనసూయ క్యారక్టర్ పేరు దాక్షాయణి. మంగళం శ్రీను భార్యగా పవర్ ఫుల్ గా నటించింది. అందులో పుష్ప మంగళం శ్రీనుని ముప్పతిప్పలు పెడతాడు. దాంతో దాక్షాయణి పుష్ప మీద పగ పెంచుకుంటుంది. ఇప్పుడు ఆమె లుక్ తో పార్ట్ టూ లో పుష్ప కి ఆమెకి మధ్య ఒక రేంజ్ లో కథ నడవబోతుందని తెలుస్తుంది. కాకపోతే ఆగస్టు పదిహేను దాకా ఆగాల్సిందే. అల్లు అర్జున్ (allu arjun)కెరీర్లోనే అత్యధిక బడ్జట్ తో తెరకెక్కుతుండగా సుకుమార్ (sukumar)దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.రష్మిక, ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రలని పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప పుష్ప అనే సాంగ్ రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది