అల్లు అర్జున్ ని వైసీపీ వాడుకుంది.. విదేశాల నుంచి వచ్చింది నిజం
on May 16, 2024
తెలుగు సినిమా మంచి కోరుకునే వ్యక్తుల్లో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ (natty kumar)కూడా ఒకరు. కొన్ని దశాబ్దాల నుంచే ఆయనకి సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. విశాఖ టాకీస్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలని నిర్మించాడు. తాజాగా పవన్ కళ్యాణ్ (pawan kalyan)అల్లు అర్జున్ (allu arjun)ల పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి హాట్ టాపిక్ గా నిలిచాయి.
బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టికుమార్ మాట్లాడుతు పిఠాపురం లో పవన్ గెలుపుకు తొంబై తొమ్మిది శాతం సపోర్ట్ ఉంది.అల్లు అర్జున్ వైసిపీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వెళ్లినా పవన్ కి వచ్చిన నష్టం లేదు. అయినా ఎవరి ఇష్టం వారిది. ఇందులో బన్నీ ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రచారానికి వెళ్లే వెళ్లేముందు ఆలోచించాల్సింది. దాని వల్ల బన్నీఫోటోని వైసిపి పార్టీ సోషల్ మీడియాలో ప్రచారానికి వాడుకుంది.ఈ విషయాన్నీ బన్నీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పాడు.ఇక మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)అనే ఒక మహా వృక్షం వల్లే మెగా హీరోలు ఇండస్ట్రీలో ఎదిగారని కూడా తెలిపాడు.ఇక ఎన్నికల ఫలితాల గురించి కూడా వివరించారు.ఇచ్ఛాపురం నుంచి పిఠాపురం వరకు తిరిగి, స్వయంగా గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుని మరీ చెబుతున్నాను. కూటమి అభ్యర్థులు ఉత్తరాంధ్ర లో భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. 70 లక్షల ప్రజలు జన్మభూమి మీద అభిమానంతో ఎవరికి వారే దేశవిదేశాల నుంచి వచ్చి , ఓటు హక్కు వినియోగించుకున్నారు..ఇంతకుముందెప్పుడు ఈ స్థాయిలో రావడం చూడలేదు. అధికార వైసీపీ పక్షం పైన వ్యతిరేకంతోనే వారంతా భారీగా వచ్చారు. అధికార పార్టీ మంత్రులు, క్యాబినేట్ మొత్తం ఓటమి చవి చూడనుంది. అందుకే భయంతో అధికార పక్షం వారు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. కొందరు అధికారులు తొత్తులుగా మారి ఈ చర్యలకు సపోర్ట్ చేస్తున్నారు. వారిందరికకీ శాశ్వతంగా రెస్ట్ వస్తుందని తెలిపాడు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక . సినిమా పరిశ్రమ అభివృద్ధి కి కృషి చెస్తుంది. యువకులకు ఉపాధి అవకాశాలను కలిపిస్తుందని తెలిపాడు
అలాగే తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ హఠాత్తుగా శుక్రవారం నుంచి సినిమా ధియేటర్స్ ను తాత్కాలికంగా మూసివేసేందుకు నిర్ణయించడం షాక్ కు గురి చేసిందని తెలిపారు. థియేటర్లలో ఆక్యపెన్సీ తగినంత లేకపోవడంతో థియేటర్స్ ను బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ వారు చెబుతున్నారు. ఉన్నట్లుండి సడన్ గా ధియేటర్స్ మూస్తే ఇబ్బంది.మీ వల్ల నిర్మాతలకు ,మల్టీప్లెక్స్ లకు కూడా ఇబ్బందే..నిర్మాతలు కంటెంట్ సిద్ధం చేసుకున్నాక ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయి. దీనివల్లప్రేక్షకులు ఓటిటిలకు ఇంకా అలవాటుపడతారు. మరలా ధియేటర్స్ ఓపెన్ చేసినా ఆడియన్స్ వస్తారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. కల్కీ, పుష్ప 2 ఓజి , దేవర వంటి పెద్ద సినిమాలకు మాత్రమే. మాకు కావాలి చిన్న సినిమాలు వద్దని మీ ఉద్దేశమా అని కూడా నట్టి కుమార్ ప్రశ్నిస్తున్నాడు. వెంటనే అత్యవసర జాయింట్ కమిటి మీటింగ్ ఏర్పాటు చేసి, దీనిపై అందరికీ ఆమోదయోగ్యమైన మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు
Also Read