గోపీచంద్‌ను పక్కన పెట్టిన సుధీర్!
on Jan 27, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది అయిన సుధీర్ బాబు హంట్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఎప్పుడో ప్రకటించిన పుల్లెల గోపీచంద్ బయోపిక్ గురించి స్పందించారు. ఎందుకు ఆలస్యమైంది అన్న విషయం చెప్పకపోయినా ఈ చిత్రం పూర్తి చేయడానికి మరో రెండు మూడేళ్ల సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చారు. భారతీయ బ్యాట్మెంటన్ ప్లేయర్ అయిన గోపీచంద్ జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ బయోపిక్ ను వెబ్ సిరీస్ గా చేయాలా లేదా సినిమాగా తెరకెక్కించాలా అనే విషయంలో సందిగ్ధం నెలకొందని వార్తలు వస్తున్నాయి.
ఇక పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సుదీర్ బాబుచేయనున్నారు. ఏరికోరి మరీ ప్రవీణ్ సత్తార్ ను ఎంపిక చేసుకున్నారు. బ్యాట్మెంటన్ లో శిక్షణ తీసుకోవడంతో పాటు మేక్ ఓవర్ లో కూడా గోపీచంద్ తరహాలో కనిపించేందుకు సుధీర్ బాబు ఎంతో కష్టపడుతున్నారు. అయినా కూడా ఈ బయోపిక్ మరి ఇంతగా లేట్ కావడానికి కారణం ఏమిటి అనేది మాత్రం అర్థం కావడం లేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
