ఆ కుర్చీకి రాజమౌళి మాత్రమే అర్హుడు!
on Jan 27, 2023
పూర్వాశ్రమంలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ లెక్కల మాస్టారు అన్న విషయం తెలిసిందే. ఆయన తీసే సినిమాల్లోనే కాదు ఆయన మామూలు జీవితంలో కూడా లెక్కల మాస్టారు జీవితం పెనవేసుకొని ఉంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే ఈ చిత్రం సాధిస్తున్న ఘనత అంతా కాదు. ఇప్పటికే రివార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం అవార్డుల రేసులో దూసుకొని పోతోంది. ఏకంగా అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంటుంది.
నాటు నాటు పాటతో పాటు ఈ సినిమాకు, రామ్ చరణ్ ,ఎన్టీఆర్ గా నటనకు రాజమౌళి దర్శకత్వ శైలికి ఆస్కార్ కూడా దాసోహం అంటుందా లేదా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సందర్భంగా పలువురు రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ సుకుమార్ మాత్రం తనదైన మాస్టర్ మైండ్ తో చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. తాజాగా సుకుమార్ ఒక ఫోటోను షేర్ చేశాడు. తాను సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చలో భాగంగా ప్రిన్సిపాల్ ఛైర్ ను ఖాళీగా వదిలేస్తూ ఉంటానని పేర్కొన్నారు. దాని కారణమేమిటి అనేది ఆయన చాలా తెలియజేశాడు.
ఆ ప్రిన్సిపాల్ కుర్చీకి కేవలం రాజమౌళి గారే అర్హులు. ఇప్పుడు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆ ప్రిన్సిపాల్ కుర్చీ ఆయనకే దక్కుతుంది అని తెలిపారు. పాన్ ఇండియా దర్శకుడిగా సుకుమార్ కు కూడా పుష్ప చిత్రంతో ఎనలేని క్రేజీ వచ్చింది. ఇంత పెద్ద దర్శకుడు ఇంటెలిజెంట్ డైరెక్టర్ అయిన సుకుమార్ రాజమౌళి విషయంలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
