
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన 'ది రాజాసాబ్' ఫలితం గురించి తెలిసిన విషయమే. ఫ్యాన్స్ కైతే షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. రీసెంట్ గా రాజా సాబ్ ఫలితంపై ఆ చిత్ర నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజి విశ్వప్రసాద్ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.
ఆయన మాట్లాడుతు రాజా సాబ్ విషయంలో మొదట జరిగిన అతి పెద్ద ఫండమెంటల్ మిస్టేక్ రిలీజ్ టైం. సినిమా వచ్చిన సీజన్ కరెక్ట్ కాదు. వేరే ఏ సీజన్ లో వచ్చినా రిజల్ట్ మరోలా ఉండేది.టికెట్ రేట్స్ పెంచడానికి కూడా ప్రయతించడం సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. నిజానికి మేము తొలిసారి టికెట్ రేట్స్ పెంచడానికి ప్రయత్నించిన సినిమా. ఆ విధంగా చేయకుండా ఉండాల్సింది. దానివల్ల రిలీజ్ టైం ఆలస్యమయింది. రిలీజ్ రోజే ప్రీమియర్స్ డిలే కావడం,ఇతర సాంకేతిక సమస్యలు సైతం సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ ప్రత్యేకమైన క్యారక్టర్ కోసమే ఎదురుచూపులు

ఇక ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ స్పిరిట్ ని పీపుల్ మీడియానే డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ నెల 17 న గరివిడి లక్ష్మికి పీపుల్ మీడియానే నిర్మించింది. ఆ చిత్ర ప్రమోషన్స్ లోనే రాజా సాబ్ పై మాట్లాడటం జరిగింది.
[Producer Tg Vishwa Prasad About The Raja saab Plop, The Raja Saab, TG Vishwa Prasad, Prabhas movie result, garividi Lakshmi, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






