మహేష్ అభిమానికి షాకింగ్ రిప్లై ఇచ్చిన యంగ్ ప్రొడ్యూసర్!
on Feb 4, 2023
సినిమా షూటింగ్ లోనే ఉండగా ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అని చెప్పడం అవివేకం అవుతుంది. ఏదో కాంబినేషన్ చూసి ఫలానా చిత్రం సూపర్ హిట్ అవుతుందని ముందుగా ఎవరు నిర్ణయానికి రాకూడదు రాలేరు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 28 అనే చిత్రం రూపొందుతోంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఇది. అలాగే త్రివిక్రమ్ తో 12 ఏళ్ల తర్వాత ఆయన మరల జోడి కడుతున్నారు. ఇంతకుముందు అతడు, ఖలేజా చిత్రాలతో వచ్చిన ఈ కాంబినేషన్ తాజాగా హ్యాట్రిక్ మూవీ గా రానుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై చిన్న బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన వాయిదాలు పడుతూ వస్తుంది. దాంతో ముందుగా అనుకున్న స్టోరీ నీ పక్కన పెట్టి అలా వైకుంఠపురంలో స్టైల్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనను త్రివిక్రమ్ ఎంచుకున్నారట.
ఈ చిత్రం షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా ప్రారంభమవ్వడమే కాకుండా హై స్పీడ్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ నిర్విరామంగా షూటింగ్ జరుగుతుంది. ఇందుకు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి నిర్మాత అయిన యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఆ మధ్యన ఆయన అవతార్ 2 సినిమా ని చూసి అది ఒక డాక్యుమెంటరీ అని కామెంట్ చేశారు. ఇటీవల బుట్ట బొమ్మ విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఓ మహేష్ అభిమాని ఎస్ఎస్ఎంబి 28 గురించి ట్విట్ చేశారు. ఇది మంచి సినిమా అంటూ పేర్కొన్నారు. దానికి నాగ వంశీ ఇచ్చిన సమాధానం వింటే మైండ్ బ్లాక్ అవుతుంది.
మీరు ఇప్పుడు ప్రొడక్షన్ లో ఉన్న చిత్రాలను అంచనా వేయడం ప్రారంభించారు. ఎస్ఎస్ఎంబి 28 సినిమా మంచి సినిమా అని మీరు నిర్ణయించుకున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్... వీలైతే రాబోయే ప్రపంచ కప్ ఫలితాన్ని కూడా అంచనా వేసేందుకు ప్రయత్నించండి.... అంటూ అభిమానిని ఒక జ్యోతిష్యకుడిలా కొట్టిపారేస్తూ కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వంశీ ఇచ్చిన సమాధానం పలువురికి ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఏదైనా ప్రాక్టికల్ గా ఉండడం మంచిదని ఈ వ్యాఖ్యల ద్వారా సూర్యదేవర నాగవంశీ చెప్పినట్లు అయింది. తొందరపడి సినిమాలను అంచనా వేయకూడదు.... సినిమా పూర్తయి విడుదలైన తర్వాత జడ్జిమెంట్ చేయాలనేది ఆయన నిర్ణయంగా అర్థమవుతుంది.
Also Read