TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ప్రియ‌మ‌ణి ముచ్చ‌ట.. ‘నారప్ప’ తీరుస్తాడా?

Jun 8, 2020 4:06PM

 

‘ఎవరే అతగాడు’ (2003)తో కథానాయికగా తొలి అడుగేసింది ప్రియమణి. ఆపై తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నాయికగా సందడి చేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. తమిళ చిత్రం ‘పరుత్తివీరన్’తో బెస్ట్ యాక్ట్ర‌స్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రియమణి.. తెలుగులో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు చేసినా విజయాలు అంతంత మాత్రమే. కెరీర్ ఆరంభంలో ‘పెళ్ళైన కొత్తలో’, ‘యమదొంగ’తో మంచి విజయాలు అందుకున్న ప్రియమణి ఆ తరువాత మాత్రం ఆ స్థాయి హిట్స్‌ని చూడలేకపోయింది. మరీ ముఖ్యంగా.. సీనియర్ స్టార్స్‌తో ప్రియమణి జట్టుకట్టిన సినిమాలేవీ బాక్సాఫీస్‌ని మెప్పించలేకపోయాయి.

నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన చేసిన ‘మిత్రుడు’ (2009) నిరాశపరచగా.. ‘కింగ్’ అక్కినేని నాగార్జునకి జోడిగా సందడి చేసిన ‘రగడ’ (2010) యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకుంది. ఆ తరువాత మళ్ళీ సీనియర్ స్టార్స్ పక్కన కనిపించని ప్రియమణి.. దాదాపు పదేళ్ళ తరువాత ఆ తరహా అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆ చిత్రమే.. ‘నారప్ప’. తన రెండో తమిళ చిత్రం ‘అదు ఒరు కణ‌ కాలం’ కథానాయకుడు ధనుష్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘అసురన్’ ఆధారంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. టైటిల్ రోల్‌లో విక్టరీ వెంకటేష్ నటిస్తుండగా.. అతనికి జోడిగా సుందరమ్మ పాత్రలో ప్రియమణి దర్శనమివ్వనుంది. 70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. మరికొద్ది రోజుల్లో మిగ‌తా షూటింగ్‌ను జ‌రుపుకోనుంది. 2021 సంక్రాంతి కానుకగా ఈ యాక్షన్ థ్రిల్లర్ జనం ముందుకు వచ్చే అవకాశముందని టాక్.

మరి.. బాలయ్య, నాగ్ కాంబినేషన్‌లో హిట్స్ అందుకోలేకపోయిన ప్రియమణి.. మరో సీనియర్ స్టార్ వెంకీ జోడిగానైనా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.

google-ad-img