వాళ్ళిద్దరి మధ్య... మనసంతా నువ్వే 2.ఓ
on Jun 8, 2020

సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా వచ్చిన 'మనసంతా నువ్వే' ఘన విజయం సాధించింది. తెలుగులో ప్రేమకథలకు కొత్త బాట వేసింది. ఆ సినిమా తీసినది దర్శకుడు విఎన్ ఆదిత్య. తొమ్మిదేళ్ల విరామం తర్వాత 'వాళ్ళిద్దరి మధ్య' సినిమాతో మరోసారి ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటించిన ఈ సినిమాను 'మనసంతా నువ్వే 2.ఓ'గా విఎన్ ఆదిత్య పేర్కొన్నారు. కాంటెంపరరీ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కించానని ఆయన తెలిపారు. "నేను 'మనసంతా నువ్వే' సినిమా తీసినప్పటికీ, ఇప్పటికీ ప్రేమకు అర్థం మారింది. అప్పటితో పోలిస్తే ఓ జంట మధ్య భావోద్వేగాలు ఇప్పుడు వేరుగా ఉంటున్నాయి. అప్పట్లో బ్రేకప్ పెద్ద ఇష్యూ. ఇప్పుడు సమస్య కాదన్నట్టు ఉంది" అని విఎన్ ఆదిత్య అన్నారు. ప్రేమకథకు చక్కటి కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు మేళవించి అందమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను మలిచానని ఆయన తెలిపారు.
కరోనా, లాక్‌డౌన్ లేకపోతే సినిమా విడుదలై నాలుగు వారాలు అయ్యేది. ఏప్రిల్ 12న 'వాళ్ళిద్దరి మధ్య'ను విడుదల చేయాలని అనుకున్నారు. పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇప్పుడు థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. ఎప్పుడు ఓపెన్ అయినా ముందు చిన్న సినిమాలను విడుదల చేస్తే బావుంటుందని విఎన్ ఆదిత్య ఆశిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



