
ప్రేమలు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల అభిమాన నటులలో నస్లీన్ కూడా ఒకడు. ఇందుకు సాక్ష్యం కొత్త లోక చాప్టర్ 1 లో నస్లీన్ స్క్రీన్ పై కనిపించగానే వచ్చిన రెస్పాన్స్ నే అందుకు సాక్ష్యం. ఇక ప్రేమలు తెచ్చిన క్రేజ్ కారణంగా మేకర్స్ వెంటనే దీనికి సీక్వెల్‌గా 'ప్రేమలు 2' ప్రకటించారు.
అయితే ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా రద్దు కావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై తాజాగా దర్శకుడు గిరీష్ ఏడీ ఓ ఇంటర్వ్యూలో నిరాశని వ్యక్తం చేశాడు. 'ప్రేమలు 2' కోసం తాము దాదాపు ఒక పూర్తి ఏడాది పాటు ఎంతో కష్టపడి కథ, కథనాలపై వర్క్ చేశామని, కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.అసలు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేని విధంగా ఏడాది సమయం వృథా కావడం తనను ఎంతో బాధిస్తోందని గిరీష్ ఏడీ ఆవేదన వ్యక్తం చేశారు. అంత విలువైన కాలాన్ని కేవలం సీక్వెల్ కోసం కేటాయించడం, ఆ తర్వాత అది కాస్తా నిలిచిపోవడం తమ టీమ్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు. మొదటి భాగం సాధించిన భారీ విజయం తాలూకు ఒత్తిడి, అంచనాల కారణంగానే సీక్వెల్ ఆలోచన ముందుకు వచ్చిందని, అయితే అనుకున్న స్థాయిలో సంతృప్తికరమైన కథ రాకపోవడం వల్లనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేకర్స్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ ఏడాది కాలపు శ్రమ వృథా అయినప్పటికీ, ఆ నిరాశ నుంచి వెంటనే తేరుకుని తాము మరొక కొత్త ప్రాజెక్ట్ వైపు దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: విజయ్ దేవరకొండని కాపాడిన అగ్ర హీరో: బయటపడ్డ సంచలన నిజాలు!

'ప్రేమలు 2' రద్దు అయిన తర్వాతే తాము నివిన్ పౌలీ మరియు మమితా బైజు కాంబినేషన్‌లో వస్తున్న 'బెత్లహోమ్ కుటుంబ యూనిట్' సినిమా ఆలోచనలోకి వెళ్లామని గిరీష్ తెలిపారు. నిజానికి ఈ కథను 'ప్రేమలు' కన్నా ముందే చేయాలని అనుకున్నప్పటికీ, సీక్వెల్ క్రేజ్ కారణంగా దానిపై దృష్టి పెట్టామన్నారు. అనుకోని పరిణామాల వల్ల మొదటి ప్రాజెక్ట్ ఆగిపోయినా, ఆ తర్వాత ప్రారంభించిన 'బెత్లహోమ్ కుటుంబ యూనిట్' చిత్రం ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకోవడం తమకు వ్యక్తిగత విజయంగా భావిస్తున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో తన వెంటే నిలిచిన నిర్మాతలకు, కో-రైటర్ కిరణ్ జోసెఫ్‌కు మరియు తన టెక్నికల్ టీమ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏదేమైనా తెలుగు, మలయాళ భాషల్లో యూత్‌ను ఉర్రూతలూగించిన 'ప్రేమలు' చిత్రానికి సీక్వెల్ రాకపోవడం మాత్రం అభిమానులకు ఎప్పటికీ తీరని నిరాశగానే మిగిలిపోయింది. ఇక ప్రేమలు 2' ఆగిపోవడానికి నస్లెన్ నో చెప్పడమే కారణమంటూ పలు చోట్ల వార్తలు వినిపిస్తున్నాయి.
[Premalu Director About Premalu 2, Premalu 2 shelved girish ad expresses disappointment, Premalu 2 Issue, Premalu Director, Nasleen, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






