Home

»

Latest News

కయదు లోహర్ తాగిన వాటర్ బాటిల్ అమ్మకానికి: రేటు తెలిస్తే షాక్ అవుతారు!

Oct 21, 2026 5:49PM

 

పైత్యం  పలు రకాలు.. టైం వచ్చినప్పుడు ఆ పైత్యం ఎవరి సాయం లేకుండానే బయటపడుతుంది. ఈ విషయం నిజమని ప్రముఖ హీరోయిన్ ది ప్యారడైజ్ ఫేమ్  'కయదు లోహర్' తాగిన వాటర్ బాటిల్ సంఘటన నిరూపిస్తుంది. 


కయదు లోహర్  తాగిన వాటర్ బాటిల్‌ని కేరళకి చెందిన ఒక వ్యక్తి ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టి 3 లక్షల ధరగా నిర్ణయించాడు. ఇప్పుడు ఈ న్యూస్  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ వ్యక్తి ఆ బాటిల్‌కు సంబంధించిన ప్రకటనలో రాసుకొచ్చిన వివరాలు చూస్తే మతిపోతుంది. "ఇది ప్రముఖ నటి కాయదు లోహార్ నీళ్లు తాగిన ఒరిజినల్ వాటర్  బాటిల్. ఇందులో ఇంకా కొద్దిగా నీరు అలాగే ఉంది. ఈ బాటిల్‌ను శుభ్రం చేసి భద్రపరుచుకోవచ్చు. సెలెబ్రిటీ టచ్ చేసిన అత్యంత అరుదైన వస్తువు ఇది. నిజంగా ఈ అరుదైన ఐటమ్‌ను కొనుగోలు చేయాలనుకునే ఆసక్తి ఉన్నవారు నన్ను నేరుగా సంప్రదించండి" అంటూ పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: ప్రేమలు డైరెక్టర్ సంచలనం: ఆ హీరోపై సెటైర్స్ వేశాడా!

 

 


కొందరు  నెటిజన్లు అయితే దీనిపై సరదాగా మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. "అభిమానం వేరు, ఇలాంటి వింతైన పిచ్చి పోకడలు వేరు" అంటూ మరికొందరు మండిపడుతున్నారు. అయితే ఈ వార్తకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఓఎల్‌ఎక్స్ వేదికపై అటువంటి అసలైన లిస్టింగ్ లేదా ప్రకటన అధికారికంగా బయటపడలేదు. కేవలం ఒక ఫొటోని ఆధారం చేసుకుని ఎవరో సరదాగా సృష్టించిన ఫేక్ పోస్ట్ కావచ్చునని, లేదా నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు కావాలనే సృష్టించిన ప్రచారం అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ  ఉదంతంపై  కయదు  స్పందించలేదు. నడుస్తున్న కాలం సోషల్ మీడియా కాలం కాబట్టి స్పందించే అవకాశాలు ఎక్కువే. 

 

[kayadu Lohar Water Bottle Three Lakhs olx, Kayadu Lohar, Kayadu Lohar water bottle, OLX viral news, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com