వర్మ సినిమా టైటిల్ 'కరోనా వైరస్' కాదు
on Jun 5, 2020
తెలుగులో కరోనా వైరస్ మహమ్మారిపై ఓ సినిమా తెరకెక్కింది. మరో సినిమా షూటింగ్ కొంత పూర్తయింది. ఈ రెండు కరోనా వైరస్ సినిమాల వెనుక ఇద్దరు వర్మలు ఉండడం విశేషం. ఒక వర్మ రామ్ గోపాల్ వర్మ అయితే... మరో వర్మ 'అ!', 'కల్కి' సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ. లాక్డౌన్లో కరోనా వైరస్ మీద తన టీమ్‌తో కలిసి రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడమే కాదు, ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓటీటీలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
విదేశాల్లో కరోనా మహమ్మారి జూలు విదిల్చిన సమయంలో ఒక కథ రాసి, కొంతవరకూ షూటింగ్ చేశారు ప్రశాంత్ వర్మ. మన దేశంలోకీ కరోనా వస్తుందని ఆయన ఊహించలేదు. కరోనా ఎఫెక్ట్ ఇండియా మీద, ముఖ్యంగా షూటింగులు బంద్ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ మీద కూడా పడింది. అందువల్ల, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తీస్తున్న సినిమా షూటింగ్ ఆగింది. ఇటీవల దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రీ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకి కూడా కరోనా వైరస్ టైటిల్ ఖరారు చేసినట్టు గుసగుసలు వినిపించాయి. అందులో నిజం లేదని ప్రశాంత్ వర్మ తెలిపారు. తన సినిమా టైటిల్ 'కరోనా వైరస్' కాదన్నారు.
Also Read