
ఇప్పుడు ఎక్కడ చూసినా సిఎం ఇళయ దళపతి విజయ్(VIjay)అనే స్లోగన్ మాత్రమే వినపడుతుంది. ఇంకేం వినపడటం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా విజయ్ కి అభిమానసుమాంజలిలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రకాష్ రాజ్(Prakash Raj)మాత్రం విజయ్ విజయంపై ఆసక్తి కర ట్వీట్ చేసాడు.ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.
ఇది గెలుపే కాదు. తమిళ జాతిపిత, భారత రత్న కామరాజ్ ఓడిపోయారు. స్టాలిన్ ఓడిపోయారు. సమాజం కేవలం అభిమానుల మయం అయిపోయింది. రాజకీయం చైతన్యం కలిగిన సమాజంగా మారలేదు అనడానికి ఈ ఎన్నికలే ఒక ఉదాహరణ. రాజకీయ విజ్ఞానాన్ని పెంచే వారి పని ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడమే. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. విజేతలకి శుభాకాంక్షలు. ఏం చేయబోతారో కూడా చూద్దామని తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు.
also read: suprita: నన్ను చంపుతారా ప్లీజ్
ఎన్నికలకి ముందు విజయ్ ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతు సినిమాల్లో ఒకే పాటలో డాక్టర్, ఇంజనీర్ లేదా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. కానీ రాజకీయం వేరు, భాషకి లేదా ప్రజల ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు విజయ్ ఎప్పుడైనా వచ్చి నిలబడ్డారా. నటుడి కోసం థియేటర్లో ఈలలు వేయడం వేరు, కానీ దేశ భవిష్యత్తుని ఆయన చేతిలో పెట్టడం వేరు, విజయ్ కి రాజకీయ అనుభవం లేదు. తమిళుల ఆత్మగౌరవాన్ని మోదీ పాదాల చెంత పెట్టే బానిస మోడల్ కాకుండా, ద్రావిడ మోడల్ అవసరమని, విజయ్ రాజకీయాలు కేవలం సినిమాలకి పరిమితమని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ మాటలు విజయ్ గెలుపు నేపథ్యంలో మరో సారి వైరల్ గా మారడంతో ప్రకాష్ రాజ్ మాటలని తమిళ ప్రజలు ఎవరు విన్నట్టుగా లేదనే కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.




